వేదిక: హన్మకొండలోని నందనా గార్డెన్స్
క్రెడాయ్, కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బుధవారం వరంగల్ ప్రాపర్టీ షో 2019 ను నిర్వహిస్తున్నట్టు తెలిపింది. రెండు రోజుల కార్యక్రమం 2019 అక్టోబర్ 19 మరియు 20 తేదీలలో వరంగల్ లోని నందనా గార్డెన్స్ లో జరుగుతుంది.
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో వరంగల్ ప్రముఖం. ఈ నగరంలో ఇటీవల కాలంలో ఐటీ రంగం విస్తరిస్తున్నది.
ఈ నెల 19, 20 తేదీల్లో ప్రాపర్టీ షోను నిర్వహిస్తున్నామని క్రెడాయ్ తెలంగాణ ఛైర్మన్ గుమ్మి రాంరెడ్డి తెలిపారు. వరంగల్లో పేరెన్నిక గల గృహసముదాయాలు, విల్లాలు, వ్యక్తిగత గృహాలకు సంబంధించిన సమాచారాన్ని కొనుగోలుదారులకు ఈ షో ద్వారా అందజేస్తామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. క్రెడాయ్ తెలంగాణా కార్యదర్శి ప్రేమ్ సాగర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రేటర్ వరంగల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని చాలామంది కలలు కంటారు. కానీ, వివిధ ప్రాంతాల్లో ధరలెలా ఉన్నాయో చాలామందికి తెలియదని, ఈ ప్రాపర్టీ షోలో.. ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాల రేట్లు సులువుగా తెలుసుకోవచ్చని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ప్రాపర్టీ షోలో దాదాపు 75 స్టాళ్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికల్ని రచిస్తున్నామని చెప్పారు.