హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రణీత్ గ్రూప్ 12వ వార్షికోత్సవం హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రణీత్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్రకుమార్ కామరాజు, డైరెక్టర్లు నర్సింగరావు కామరాజు, రామాంజనేయులు, నర్సిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఆదిత్య కామరాజు, దినేష్ రెడ్డి, సందీప్ రావు మాధవరం, రాజేందర్ పాల్గొన్నారు.
రూ.250 కోట్ల టర్నోవర్..
ప్రణీత్ గ్రూప్ టర్నోవర్ రూ.250 కోట్లుగా ఉంది. ప్రణీత్ గ్రూప్ సుమారు 300 మంది ఉద్యోగులుంటారు. 2007లో ప్రారంభమైన ప్రణీత్ గ్రూప్ ప్రస్థానం నేటితో 12 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు గచ్చిబౌలి, బాచుపల్లి, మల్లంపేట, బౌరంపేట వంటి తదితర ప్రాంతాల్లో 22కి పైగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేసింది. సుమారు 4 వేలకు పైగా కస్టమర్లున్నారు. రియల్ ఎస్టేట్‌తో పాటూ యూపీవీసీ, కో–వర్కింగ్ స్పేస్, ఫార్మా, ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్‌ను కూడా నిర్వహిస్తుంది. త్వరలోనే క్యాబ్ అగ్రిగేట్ వ్యాపారంలోకి ఎంట్రీ ఇవ్వనుంది.