Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

అద్దె అడ్వాన్స్‌ కోసం డబ్బు కావాలా?

సామాన్య, మధ్యతరగతి వాసులు హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాల్లో సొంతిల్లు కొనడం సంగతి పక్కన పెడితే.. అద్దెకు ఉండటమూ కష్టమే. ఎందుకంటే రెంట్‌ అడ్వాన్స్‌ చెల్లిచడం ఇబ్బంది కాబట్టి! కొన్ని నగరాల్లో 3 నెలలు, ఏడాది అద్దె కూడా ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది మరి. దీనికి పరిష్కారం చూపిస్తోంది క్యాష్‌ఇ! అద్దె అడ్వాన్స్‌ కోసం రుణాలిచ్చే సేవలను ప్రారంభించేసింది!!
మ్యాజిక్‌బ్రిక్స్‌తో ఒప్పందం..
డిజిటల్‌ లెండింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ క్యాష్‌ఇ మ్యాజిక్‌బ్రిక్స్‌.కామ్‌తో ఒప్పందం చేసుకుంది. మ్యాజిక్‌బ్రిక్స్‌లో నమోదు అయిన ప్రాపర్టీలకు అద్దె అడ్వాన్స్‌ కోసం రుణాలను అందిస్తుంది. 6 నగరాల్లోని 2.5 లక్షల ప్రాపర్టీలకు రుణ సౌకర్యం అందుబాటులో ఉంటుందని క్యాష్‌ఇ సీఈఓ కేతన్‌ పటేల్‌ తెలిపారు. తొలి దశలో బెంగళూరు, పుణె, ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్‌ నగరాల్లోని ప్రాపర్టీలకు రుణాలను అందిస్తామని.. విడతల వారీగా ఇతర నగరాలకు విస్తరిస్తామని పేర్కొన్నారు. రూ.5 వేల నుంచి రూ.2 లక్షల వరకు రెంట్‌ అడ్వాన్స్‌ లోన్‌ తీసుకోవచ్చు. తీసుకున్న రుణాన్ని 6 నెలల వాయిదాల్లో చెల్లించవచ్చని తెలిపారు.

Related Posts

Latest News Updates