Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

అపర్ణా నుంచి నూతన శ్రేణి యూపీవీసీ ఉత్పత్తులు

అపర్ణా ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన యూపీవీసీ బ్రాండ్‌ ఓకోటెక్‌ నూతన శ్రేణి ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది. విల్లా, టిల్ట్‌ అండ్‌ టర్న్, ఆర్చ్‌ విండోలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కొనుగోలుదారుల అభిరుచులు, డిమాండ్‌కు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు సరికొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్నామని ఒకోటెక్‌ సీఈఓ మహేశ్‌ చౌదరి తెలిపారు. ప్లాంట్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నామని, త్వరలోనే ప్రస్తుతం నెలకు 300 టన్నులుగా ఉన్న ఉత్పత్తి సామర్థ్యం 450 టన్నులకు పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. గోల్డెన్‌ ఓక్, డార్క్‌ ఓక్, రుస్టిక్‌ ఓక్, వాల్నట్‌ వంటి ప్రొఫైల్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ కిటికీల నిర్వహణ చాలా సులువు. తుప్పు పట్టవు. విద్యుత్, అగ్ని ప్రమాదాలను తట్టుకునేలా వీటిని తయారు చేశారు.

Related Posts

Latest News Updates