Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

అమరావతి నుంచి ప్రపంచ బ్యాంక్‌ ఔట్‌!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి షాక్‌ తగిలింది. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి పనులకు బ్రేక్‌ పడింది. రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల ఏర్పాట్లకు అవసరమైన నిధుల సమీకరణ నుంచి ప్రపంచ బ్యాంక్‌ విశ్రమించింది.
అమరావతి రాజధాని నిర్మాణం, రహదారులు, మౌలిక సదుపాయల ఏర్పాట్లు తదితరాల కోసం అప్పటి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 715 మిలియన్‌ డాలర్లు నిర్మాణ వ్యయాన్ని అంచనా వేశారు. ఇందులో 300 మిలియన్‌ డాలర్లు నిధులను ప్రపంచ బ్యాంక్‌ ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే రాజధాని భూ సమీకరణలో పలు అవకతవకలు, అక్రమాలు జరిగాయని, పలువురు రైతులు, ప్రభుత్వేతర సంస్థలు ప్రపంచ బ్యాంక్‌ ఏజెన్సీకి ఫిర్యాదు చేశారు.
దర్యాప్తుకు కేంద్రం నో..
అమరావతి ప్రాజెక్ట్‌ అభివృద్ధి, పనితీరు మీద స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలన్న బ్యాంక్‌ ఏజెన్సీ నిర్ణయించింది. దీనికి కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రపంచ బ్యాంక్‌ నిధుల హామీ ప్రతిపాదనను విరమించుకున్నట్లు తెలిసింది. ఏజెన్సీ స్వతంత్ర దర్యాప్తు కేంద్రం నిర్ధేశించిన నిబంధనలకు విరుద్దమని, అంతేకాకుండా ఒకవేళ అనుమతినిస్తే.. ప్రపంచ బ్యాంక్‌ నిధులు సమకూరుస్తున్న దేశంలోని ఇతర ప్రాజెక్ట్‌ల మీద స్వతంత్ర దర్యాప్తు కోరవచ్చని, అందుకే నిరాకరించినట్లు తెలిసింది. రుణం అందించే సంస్థ మంజూరు చేయడాని కంటే ముందే రుణ సంస్థ స్క్రూటీ చేయవచ్చు. అంతేతప్ప రుణం మంజూరయ్యాక కాదని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
దర్యాప్తు పూర్తయ్యాకే పనులు ప్రారంభం..
ఏపీసీఆర్‌డీఏ అభివృద్ధి పనుల్లో భారీ అవకతవకలు, అక్రమాలు జరిగాయని, వీటి మీద పూర్తి స్థాయి దర్యాప్తు జరిపిన తర్వాతే అమరావతిలో తిరిగి పనులు ప్రారంభమవుతాయని మున్సిపల్‌ శాఖ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే బొత్సా సత్యనారాయణ తెలిపారు. ఇప్పటివరకు అమరావతిలో 50 శాతం పనులు పూర్తి కావల్సి ఉండగా కేవలం 10 శాతం మాత్రమే పూర్తయ్యాయని, మిగిలిన 90 శాతంలో 20 శాతం పనులు అసలు ప్రారంభం కూడా కాలేదని తెలిసింది. గతేడాది చంద్రబాబు ప్రభుత్వం బాండ్ల జారీ ద్వారా ప్రపంచ బ్యాంక్‌ నుంచి రూ.2 వేల కోట్ల నిధులను సమీకరించింది.

Related Posts

Latest News Updates