Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

అమెజాన్‌ చెల్లించే అద్దె చ.అ.కు రూ.67

ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌.. ఇండియాలో విస్తరణ ప్రణాళికలు చేపట్టింది. బెంగళూరు, హైదరాబాద్, పుణే, చెన్నై నగరాల్లో అమెజాన్‌ కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించింది.
ముందుగా బెంగళూరులో 13 లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ను లీజుకు తీసుకోవాలని నిర్ణయించింది. ఐటీ సేవల నిర్వహణ కోసం ఈ స్థలాన్ని తీసుకోనున్నట్లు సమాచారం. 2022 నాటికి రెండు దశల్లో ఈ కొత్త స్పేస్‌లో కార్యకలాపాలను ప్రారంభమవుతాయి. ఈ స్థలం అద్దె చదరపు అడుగుకు రూ.67 చెల్లింస్తుందని, 2022 నాటికి రూ.72లకు పెంచుతామని సమాచారం. ప్రస్తుతం బెంగళూరులో అమెజాన్‌ ఇండియాకు 16 లక్షల చదరపు అడుగుల్లో కార్యకలాపాలను నిర్వహిస్తుంది.
త్వరలోనే హైదరాబాద్‌లో..
2017లో అమెజాన్‌ చెన్నైలో 45 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని, హైదరాబాద్‌లో 6 లక్షల చదరపు అడుగు స్థలాన్ని లీజుకున్న తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా నగరంలో మరొక 30 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుందని.. త్వరలోనే హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభమవుతాయని సమాచారం. అలాగే 30 లక్షల చదరపు అడుగుల్లో ఉత్తర బెంగళూరులో క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది కూడా.

Related Posts

Latest News Updates