ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్ అండ్ ఎఫ్ఎస్) తన రియల్ ఎస్టేట్ ఆస్తులను విక్రయించనుంది. సుమారు రూ.5000–6000 కోట్లు నిధులను సమీకరించి, రుణాలను తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ముంబై ప్రధాన కేంద్రంతో సహా 50 ప్రాపర్టీలను అమ్మేందుకు నిర్ణయించింది. నివాస భవనాలు, స్థలాలు, అనుబంధ సంస్థలకు చెందిన భూమి అభివృద్ధి హక్కులు తదితరాలను విక్రయ జాబితాలో చేర్చింది. హైదరాబాద్, విజయవాడలోని హిల్ కౌంటీ ప్రాపర్టీకి చెందిన 500 ఎకరాల భూమి అభివృద్ధి హక్కులు ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ పొందిన విషయం తెలిసిందే.