Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

అల్వాల్‌లోని భూమి కబ్జాపై విచారణ: ఎస్సీ, ఎస్టీ కమీషన్‌

అల్వాల్‌లోని తన భూముని కబ్జా చేశారని స్థానికురాలు నిర్మలా ఎస్సీ, ఎస్టీ కమీషన్‌లో దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమీషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ జీహెచ్‌ఎంసీ, కంటోన్మెంట్, రెవిన్యూ విభాగాలను ఆదేశించారు. కబ్జాదారుల నుంచి తన భూమిని విడిపించి తిరిగి తనకు ఇప్పించాలని, తగిన న్యాయం చేకూర్చాలని నిర్మలా కమీషన్‌ను కోరింది. విచారణ చేపట్టి పూర్తి స్థాయి నివేదిక అందించాలని శ్రీనివాస్‌ అధికారులను ఆదేశించారు.

Related Posts

Latest News Updates