Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఆంధ్రప్రదేశ్‌లో వాసవి గ్రూప్‌ తొలి ప్రాజెక్ట్‌

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఆంధ్రప్రదేశ్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. త్వరలోనే విజయవాడలోని గుంటుపల్లిలో 7 ఎకరాల్లో తొలి ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నట్లు వాసవి గ్రూప్‌ చైర్మన్‌ విజయ్‌ కుమార్‌ తెలిపారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే..
రెండేళ్లలో కోటి చ.అ…
వచ్చే రెండేళ్లలో నగరంలో సుమారు కోటి చదరపు అడుగుల్లో నివాస, వాణిజ్య సముదాయ ప్రాజెక్ట్‌లను అభివృద్ధి, సుమారు 1,500 గృహాలను నిర్మించి కొనుగోలుదారులకు అప్పగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

బాచుపల్లిలో అఫడబుల్‌ హౌజింగ్‌..
బాచుపల్లిలోని వీఎన్‌ఆర్‌ విజ్ఞాన్‌ జ్యోతి ఇంజనీరింగ్‌ కళాశాలకు చేరువలో 21 ఎకరాల్లో అఫడబుల్‌ హౌజింగ్‌ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నాం. ఇందులో 4 వేల గృహాలుంటాయి. ఒక్కో ఫ్లాట్‌ 900 చ.అ. ఉంటుంది. వీటిల్లో కొంటే ప్రధాన్‌మంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) పథకం కింద వడ్డీ రాయితీ కూడా పొందే వీలుంటుంది. హైటెక్‌ సిటీలోని మీనాక్షి సమీపంలో రెండు ప్రాజెక్ట్‌లను చేపట్టనున్నాం. 3 ఎకరాలు, 6 ఎకరాల్లో హై ఎండ్‌ లగ్జరీ అపార్ట్‌మెంట్లను నిర్మించనున్నాం. సదాశివపేటలో 150 ఎకరాలు, 60 ఎకరాల్లో రెండు ఓపెన్‌ ప్లాట్‌ వెంచర్స్‌ను ప్రారంభించనున్నాం.
గచ్చిబౌలిలో కమర్షియల్‌ ప్రాజెక్ట్‌..
గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ కిందనే 28 లక్షల చ.అ.ల్లో స్కై సిటీ ఆఫీస్‌ పార్క్‌ను అభివృద్ధి చేయనున్నాం. విప్రో సర్కిల్‌లో ఐదున్నర ఎకరాల్లో మరొక కమర్షియల్‌ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నాం.
నానక్‌రాంగూడలో ట్రెండ్స్‌..
ఇక ప్రస్తుతం హైదరాబాద్‌లో పలు రెసిడెన్షియల్, కమర్షియల్‌ ప్రాజెక్ట్‌లు నిర్మాణంలో ఉన్నాయి. నానక్‌రాంగూడ ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డు ఆనుకొని ట్రెండ్స్‌ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. 2.21 ఎకరాల్లో 6.25 లక్షల బిల్టప్‌ ఏరియాలో లగ్జరీ అపార్ట్‌మెంట్‌ ఇది. 24 అంతస్తుల్లో మొత్తం 313 యూనిట్లుంటాయి. 1,400 నుంచి 4,600 చ.అ. మధ్య విస్తీర్ణాలుంటాయి. ధర చ.అ.కు రూ.6 వేలు. 2020 జూన్‌ నాటికి నిర్మాణం పూర్తవుతుంది.
ఉషారాం ఇంటిగ్రా; శ్రీనిలయం..
టోలీచౌకీ మెయిన్‌ రోడ్‌లో 1.2 ఎకరాల్లో ఉషారాం ఇంటిగ్రాను చేపడుతున్నాం. 14 అంతస్తుల్లో మొత్తం 70 యూనిట్లుంటాయి. జీ+3 అంతస్తుల్లో కమర్షియల్, ఆపైన నివాస భవనాలుంటాయి. 2,563 నుంచి 4,800 మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. ధర చ.అ.కు 5,500. 2020 మార్చి నాటికి ప్రాజెక్ట్‌ పూర్తవుతుంది. ఎల్బీనగర్‌లో 14 ఎకరాల్లో శ్రీనిలయం ప్రీమియం టవర్స్‌ నిర్మాణంలో ఉంది. 12 టవర్లలో మొత్తం 750 ఫ్లాట్లుంటాయి. 2, 3 బీహెచ్‌కే విస్తీర్ణాలు 12,50 నుంచి 2,200 మధ్య ఉంటాయి. 2020 డిసెంబర్‌ నాటికి పూర్తవుతుంది. ధర చ.అ.కు రూ.4,800
అమీర్‌పేటలో సొలిటరీ హైట్స్‌.. ఎంపీఎం గ్రాండ్‌
అమీర్‌పేటలో 2.75 ఎకరాల్లో సొలిటరీ హైట్స్‌ను అభివృద్ధి చేస్తున్నాం. 2 టవర్లు జీ+11 అంతస్తుల్లో ఉంటాయి. మొత్తం 250 యూనిట్లు. 2, 3 బీహెచ్‌కే విస్తీర్ణాలు 1,275 నుంచి 2,480 మధ్య ఉంటాయి. 2020 డిసెంబర్‌ నాటికి పూర్తవుతుంది. ధర చ.అ.కు రూ.7,800. అమీర్‌పేటలో ఎంపీఎం గ్రాండ్‌ పేరిట కమర్షియల్‌ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నాం. 5 లక్షల చ.అ. ప్రాజెక్ట్‌. జీ+3 రిటైల్, ఆపైన ఆఫీస్‌ స్పేస్‌ ఉంటుంది. ఈ సెప్టెంబర్‌ నాటికి నిర్మాణం పూర్తవుతుంది.

Related Posts

Latest News Updates