Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

ఆకాశహర్మ్యాల్లో అగ్నిప్రమాదం జరిగితే?

హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాల్లో స్థలం కొరత కారణంగా హైరైజ్‌ భవనాలు, ఆకాశహర్మ్యాల నిర్మాణం కామన్‌ అయింది. కొనుగోలుదారులూ ఆసక్తి చూపిస్తుండటంతో డెవలపర్లు కూడా ఈ నిర్మాణాల వైపే మొగ్గు చూపిస్తున్నారు. సరే! మరి, ఆకాశహర్మ్యాల్లో అగ్ని ప్రమాదం జరిగితే? కోట్లు పెట్టి కొన్న సొమ్ము అగ్నిలో బూడిదవ్వటమే కాకుండా ఆస్తి, ప్రాణ నష్టాలూ జరిగే ప్రమాదం ఉంది. అందుకే ఆకాశహర్మ్యాల్లో ఫ్లాట్‌ కొనుగోలు చేసే ముందు అగ్ని ప్రమాద భద్రత ఏర్పాట్లు ఎలా ఉన్నాయో క్షుణ్నంగా, భౌతికంగా పరిశీలించాలని నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫైర్‌ ఆఫీసర్స్‌ (ఎన్‌ఏఎఫ్‌ఓ) సూచిస్తున్నారు. అగ్ని ప్రమాద సూచికలివే..
– 15 మీటర్ల ఎత్తు దాటిన ప్రతి భవనంలోనూ హైండ్రట్, వెట్, డ్రై రైజర్స్‌ ఏర్పాటు చేయాలి. అలాగే ప్రవేశం, ఎగ్జిట్‌ కోసం రెండు మెట్ల మార్గాలుండాలి. అవి ఒకదానికికొకటి దూరం దూరంగా ఏర్పాటు చేయాలి.
– ప్రతి అంతస్తులోనూ అగ్ని ప్రమాదాలను గుర్తించే వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. గ్రౌండ్‌ ఫ్లోర్‌కు, ఇతర ఫ్లోర్స్‌కు మధ్య రెండు వైపులా సంభాషణనలు చేసే వీలుండేలా టు వే కమ్యూనికేషన్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ప్రతి అంతస్తులోనూ మైక్‌ ఉండాలి. అగ్ని ప్రమాదాలకు సంబంధించిన సూచనలు తెలపాలి.
– ప్రజా అగ్ని మాపక విభాగంతో భౌతిక, ఆటోమెటిక్‌ డెటెక్టర్లను ఇంటర్‌లింక్‌ చేయాలి. అగ్ని ప్రమాద భద్రత వ్యవస్థ (ఫైర్‌ అలారం సిస్టమ్‌)లో భౌతిక, ఆటోమెటిక్‌ రెండు రకాలుంటాయి. 15 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుండే ప్రతి భవనంలోనూ రెండు రకాల వ్యవస్థలను ఏర్పాటు చేయాలి.
– భవనం బేస్‌మెంట్, పార్కింగ్‌ వంటి ఏరియాలో అగ్నిప్రమాదాలకు ఎక్కువ కారణం అవుతాయి. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో మండేతత్వం ఉండే పదార్థాలను నిల్వ ఉంచుతారు. అందుకే ఆయా చోట్ల నీటిని చిమ్మించే పిచికారీ వ్యవస్థ (స్ప్రింకర్లు) ను ఏర్పాటు చేయాలి. ఈ వ్యవస్థ ప్రధాన నీటి ట్యాంక్‌కు అనుసంధానమై ఉండాలి. ఎందుకంటే స్ప్రింకర్లకు నీటి కొరత ఏర్పడదు.
– కారిడార్‌లో అగ్నిప్రమాద సూచికలను, బోర్డ్‌లను ఏర్పాటు చేయాలి. ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌ను కూడా అందుబాటులో ఉంచాలి.
ప్రతి అంతస్తు, కారిడార్‌లో అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకునే మార్గ సూచిలను ఏర్పాటు చేయాలి. ఆయా బోర్డ్‌లు కాంతి, శక్తివంతమైన పెయింట్స్‌తో ఏర్పాటు చేయాలి. ఎందుకంటే కరెంట్‌ పోయినా లేదా అగ్ని ప్రమాదం జరిగినా కూడా బోర్డ్‌ కనిపించేలా ఉండాలి.
– ఫైర్‌ డ్రిల్స్, అత్యవసర సామగ్రి ఎక్కడుంది? ఎలా ప్రతి స్పందించాలి వంటి అంశాలపై యజమానులు తెలుసుకోవాలి.

Related Posts

Latest News Updates