Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఆడాళ్లా.. మజాకా!

గృహం.. రుణం లేదా దాచుకున్న సొమ్ముతోనో కొనడం మనకు తెలిసిందే. కానీ, ప్రభుత్వం అందించే పలు రాయితీలు, ప్రోత్సాహకాలతోనూ సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు. కాకపోతే ఇంటి ఓనర్‌గా మహిళ పేరుండాలి లేకపోతే కో–ఓనర్‌గానైనా ఉండాలన్నది నిబంధన. అందుకే తెలివైన గృహ కొనుగోలుదారుడు ఇంటిని భార్య, తల్లి లేకపోతే అక్క, చెల్లి మొత్తమ్మీద మహిళ పేరు మీద కొనుగోలు చేస్తాడని నిపుణులు చెబుతున్నారు.మూడేళ్లు పీఎఫ్‌ బాధ్యత ప్రభుత్వానిదే..ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ అండ్‌ మిసీలీనియస్‌ ప్రొవిజన్స్‌ చట్టం (ఈపీఎఫ్‌వో)–1952 ప్రకారం.. పురుషు ఉద్యోగులతో పోలిస్తే మహిళ ఉద్యోగి వేతనంలో పీఎఫ్‌ మినహాయింపు కాస్త తక్కువగా ఉంటుంది. అంటే సమాన వేతనం ఉన్న పురుషులతో పోలిస్తే మహిళ ఉద్యోగికి కొంచెం ఎక్కువ జీతం చేతికొస్తుందన్నమాట. తొలిసారి మహిళ ఉద్యోగి ప్రాథమిక వేతనంలో మూడేళ్ల పాటు 12 శాతం పీఎఫ్‌ చెల్లించాల్సిన అవసరం లేదు. దీన్ని ఉద్యోగిని పేరు మీద ప్రభుత్వమే భరిస్తుంది. ఉదాహరణకు.. కొత్త ఉద్యోగిని నెల జీతం రూ.15 వేలు అనుకుందాం. అంటే వార్షిక వేతనం రూ.1.80 లక్షలు. మొదటి 3 ఏళ్లు 12 శాతం ఈపీఎఫ్‌ ప్రభుత్వమే భరిస్తుంది. అంటే రూ.21,600. మొత్తంగా మూడేళ్లలో ఉద్యోగినికి అదనంగా ఇంటికీ తీసుకెళ్లే సొమ్ము రూ.64,800.గృహ రుణంలో రూ.3.5 లక్షలు ఆదా..గృహ రుణాల్లో మహిళలకు పన్ను ప్రయోజనాలుంటాయి. గృహ రుణంలో, వడ్డీ చెల్లింపుల్లో రెండింట్లోనూ రాయితీలుంటాయి. ఇంటి లోన్‌లో (ప్రిన్సిపల్‌ ఎమౌంట్‌)లో గరిష్టంగా రూ.1.5 లక్షలు, వడ్డీ చెల్లింపుల్లో రూ.2 లక్షల వరకు మినహాయింపు ఉంటుంది. అంటే మొత్తంగా రూ.3.5 లక్షలు తగ్గుతుందన్నమాట. మహిళలకు తనఖా రుణం మీద, నికర అద్దె విలువ మీద కూడా వడ్డీ రాయితీ పొందే వీలుంది. – అద్దెకిచ్చేందుకు కాకుండా స్వయంగా తానుండేందుకు లేక ఇల్లు తన పేరు మీదనే ఉంటే గనక మరిన్ని పన్ను రాయితీలున్నాయి. ప్రతి ఆర్ధిక సంవత్సరానికి రూ.1.5 లక్షల అదనపు వడ్డీ రాయితీ పొందవచ్చు. ఒకవేళ భార్యభర్తలిద్దరూ ఇంటికి సహ యజమానులుగా ఉండి, భార్యకు ప్రత్యేకంగా ఆదాయ మార్గం ఉంటే గనక.. ఇద్దరూ వ్యక్తిగతంగా పన్ను తగ్గింపులకు క్లయిమ్‌ చేసుకోవచ్చు. కాకపోతే పన్ను తగ్గింపు ఎంతనేది ప్రాపర్టీలో సహ యజమాని వాటా మీద ఆదారపడి ఉంటుంది.బ్యాంక్‌ వడ్డీ రేట్లూ తక్కువే..దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంక్‌లు గృహ రుణాల్లో మహిళలకు ప్రత్యేక వడ్డీ రాయితీలను అందిస్తున్నాయి. లోన్‌ మొత్తం పెరుగుతున్న కొద్దీ వడ్డీ రేటు తక్కుతుంది కూడా. ఎస్‌బీఐలో వార్షిక గృహ రుణ వడ్డీ రేటు 8.4–8.95 శాతంగా ఉంటే.. మహిళలకు 8.35–8.85 శాతంగా ఉంటుంది. ఐసీఐసీఐలో ఇతరులకు వడ్డీ రేటు 8.4–8.85 శాతంగా ఉంటే.. మహిళలకు 8.35–8.7 శాతంగా ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీలో ఇతరులకు 8.4–9.05 శాతంగా ఉంటే.. మహిళలకు 8.35–9.05 శాతంగా ఉంటుంది.స్టాంప్‌ డ్యూటీలోనూ రాయితీ..ప్రాపర్టీ రిజిస్ట్రేషన్‌ మహిళ పేరు మీద చేసినా లేక జాయింట్‌ ఓనర్‌గా ఉన్నా సరే స్టాంప్‌ డ్యూటీలో రాయితీ పొందవచ్చు. అయితే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఈ నిబంధన ఉండేది. ఎప్పుడైతే స్టాంప్‌డ్యూటీని 6 శాతానికి చేర్చారో అప్పుడే ఈ నిబంధనను తొలగించారని తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ (టీ బీఎఫ్‌) జనరల్‌ సెక్రటరీ జే వెంకట్‌ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ నిబంధన అమల్లో ఉంది. ఉదాహరణకు.. ఢిల్లీలో మహిళలకు స్టాంప్‌ డ్యూటీ 4 శాతం ఉంటే పురుషులకు 6 శాతంగా ఉంటుంది. హర్యానాలో మహిళలకు గ్రామీణ ప్రాంతాల్లో అయితే 4 శాతం, పట్టణ ప్రాంతాల్లో అయితే 6 శాతంగా ఉంటుంది. అదే పురుషులకు గ్రామీణ ప్రాంతాల్లో 6 శాతం, పట్టణ ప్రాంతాల్లో 8 శాతంగా స్టాంప్‌ డ్యూటీ ఉంది. రాజస్థాన్‌లో మహిళలకు 4 శాతం, పురుషులకు 5 శాతంగా ఉంది. Attachments area

Related Posts

Latest News Updates