Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

ఆన్‌లైన్‌ సబ్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసు!

కర్నాటక స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ విభాగం ఆన్‌లైన్‌లోకి మారింది. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్‌ ఒక్కటే కాదండోయ్‌.. వివాహ రిజిస్ట్రేషన్స్, స్టాంప్‌ పేపర్స్, అగ్రికల్చరల్‌ డిక్లరేషన్స్‌.. ఇలా ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్‌ సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చేశాయి.
గతేడాది నవంబర్‌లో ప్రాపర్టీలు, డాక్యుమెంట్‌ సంబంధిత సర్వీస్‌లను డిజిటలైజ్‌ చేసిన కర్నాటక ప్రభుత్వం.. తాజాగా ఆన్‌లైన్‌ భవన నిర్మాణ అనుమతులను మంజూరు చేసే ల్యాండ్‌ అండ్‌ బిల్డింగ్‌ ప్లాన్‌ అప్రూవల్‌ సిస్టమ్‌ (ఎల్‌బీపీఏఎస్‌)ను ప్రారంభించింది. దీంతో భూమి యజమానులు స్థల వినియోగ మార్పిడి (సీఎల్‌యూ), భవన నిర్మాణ అనుమతులను ఆన్‌లైన్‌లో పొందవచ్చు.
సేల్, లీజ్‌ డీడ్స్‌..
ఆన్‌లైన్‌ అనుమతుల కోసం బిల్డింగ్‌ ప్లాన్‌ను ప్రాపర్టీ యజమాని గానీ ఆర్కిటెక్ట్‌ గానీ జత చేయవచ్చు. ప్లాన్‌తో పాటూ సెల్ఫ్‌ అటెస్ట్‌ చేసిన డాక్యుమెంట్స్, సేల్‌ డీడ్, లీజు డీడ్‌ వంటివి జత చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో కొనుగోలుదారులు డిజిటల్‌ సంతకంతో దరఖాస్తు చేసుకుంటే ప్రాపర్టీ డీడ్‌ లేదా లీజ్‌ డీడ్‌ వంటివి తీసుకోవచ్చు.
ఎలక్ట్రానిక్‌ ఈసీ కూడా..
స్థిరాస్తి కొనుగోలు సమయంలో ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ (ఈసీ) అనేది అత్యంత ముఖ్యమైంది. టైటిల్‌ లేదా యాజమాన్య వివరాలకు ఇదే ఆధారం. దీన్ని ఫామ్‌ నంబర్‌ 15, 16లో జారీ చేస్తారు. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్‌ అయ్యాక సబ్‌–రిజిస్ట్రార్‌ ఆఫీసులో ఈసీని జారీ చేస్తారు.
ఇక నుంచి ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో ఈసీ తీసుకునే వెసలుబాటు ఉంది.
రిజిస్ట్రేషన్‌ బుకింగ్‌..
రిజిస్ట్రేషన్‌ చేసుకునే సబ్‌–రిజిస్ట్రార్‌ ఆఫీసును ఎంపిక చేసుకొని.. ప్రాపర్టీ విలువను నమోదు చేస్తే.. స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు వంటివి డిస్‌ప్లే అవుతాయి. ఆన్‌లైన్‌ ద్వారా పేమెంట్‌ చేయగానే.. రిజిస్ట్రేషన్‌ కోసం అపాయింట్‌మెంట్‌ను బుక్‌ అవుతుంది. కర్నాటకలోకి 250 సబ్‌–రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఈ డేటా అందుబాటులో ఉంటుంది.
వివాహ, స్టాంప్‌ పేపర్లు కూడా..
అగ్రిమెంట్స్, అఫిడవిట్స్‌ రాసుకునేందుకు అవసరమైన స్టాంప్‌ పేపర్లను కూడా ఆన్‌లైన్‌లో ప్రింట్‌ చేసుకోవచ్చు. స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌హెచ్‌సీఐఎల్‌)కు రుసుము చెల్లిస్తే ఈ–స్టాంప్‌ పేపర్‌ను ముద్రణ చేసుకునే వీలు కల్పిస్తుంది.
– ‘నో యువర్‌ మ్యారేజ్‌ ఆఫీస్‌’ పోర్టల్‌లో పెళ్లి కుమారుడు, కుమార్తె నివాసాల ఆధారంగా ఎక్కడ వివాహ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ను పొందాలో తెలుపుతుంది.
– కర్నాటక అగ్రికల్చరల్‌ ఆపరేషన్స్‌ అండ్‌ మిస్‌లీనియస్‌ ప్రొవిజన్స్‌ (కేఏసీఓఎంపీ) చట్టం కింద రైతులకు వ్యవసాయ రుణాలు, డిక్లరేషన్స్, డిస్‌చార్జీ డీడ్స్‌లను కూడా ఆన్‌లైన్‌లో పొందవచ్చు.

Related Posts

Latest News Updates