బ్యాంక్ ఖాతా, పాన్ కార్డ్, సంక్షేమ పథకాలు.. ఇలా అన్నింటికీ ఆధార్‌తో లింక్ చేసేశారు. త్వరలోనే ఆస్తులను కూడా ఆధార్‌తో అనుసంధానం చేయనున్నారు. అవినీతి, నల్లధనం, బినామీ లావాదేవీలను అరికట్టేందుకు స్థిర, చరాస్తులన్నింటినీ ఆధార్‌తో అనుసంధానం చేయాలని ఢిల్లీ హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలైంది. దీనిపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ సి. హరిశంకర్‌లతో కూడిన ధర్మాసనం ఆయా ప్రభుత్వాలకు నోటీసులు పంపింది. తదుపరి విచారణ అక్టోబర్ 15కి వాయిదా వేసింది.
బినామీ ఆస్తుల స్వాధీనం..
అవినీతిని అరికట్టేందుకు ఆధార్‌తో అనుసంధానమే సరైన మార్గమని, బినామీ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి, న్యాయవాది బీజేపీ నాయకుడు అశ్వినీ ఉపాధ్యాయ్ తెలిపారు.