Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఇంటి నిర్మాణ ఖర్చు.. రూ.15 వేలు

ఓ చిన్నపాటి సొంత ఇల్లు ఉండాలన్నది ప్రతి సామాన్య మానవుని కోరిక. మధ్య తరగతి జీవికి చుక్కలు చూపుతున్న అద్దె బంధనాల నుంచి విముక్తి పొందడానికి ప్రతి ఒక్కరూ తనదైన ఓ గూడు కావాలని ఆరాటపడుతుంటారు. అయితే అంతకంతకూ పెరుగుతున్న సిమెంటు, ఇసుక, నిర్మాణ వస్తువుల ధరలతో సామాన్యుడి సొంతింటి కల.. కలగానే మిగిలిపోతుంది. ఇక గూడు విషయంలో అలా ఉంచితే తినే తిండి ధరలు కూడా చుక్కలనంటుతూ సామాన్యుల్ని వెక్కిరిస్తున్నాయి. ‘ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు’ అని ఓ సినీకవి అన్నట్లు కూరగాయల ధరలు కూడా కొండెక్కి కూర్చున్నాయి. ఈ రెండు సమస్యలకు పరిష్కారంగా ప్రముఖ బ్యాంకింగ్‌ సంస్థ డ్యూట్‌ స్కీ రెండు ప్రాజెక్టులను సిద్ధం చేసింది. అవేమిటో తెలుసుకుందాం మరి..

సామాన్యుడికి భారంగా మారిన సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు డ్యూట్‌ స్కీ బ్యాంక్‌ ఓ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ‘అతి తక్కువ ధరలో నాణ్యతతో కూడిన ఇంటి నిర్మాణం’ అనే అంశంపై ఆన్‌లైన్‌ విధానంలో ప్రపంచ వ్యాప్తంగా పోటీలను నిర్వహించింది. ఈ పోటీలో ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల ఎంట్రీలు రాగా, వాటి నుంచి ఆరు ఎంట్రీలను ఫైనల్స్‌కు ఎంపిక చేసింది. ఆ ఆరు ఎంట్రీలలో మొదటి స్థానంలో నిలిచిందే ఈ రూ. 15 వేలతో ఇంటి నిర్మాణం. (స్థలం ధరను మినహాయించి) ఈ ప్రాజెక్టును అమెరికాలోని డార్ట్‌మౌత్‌ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న విజ య్‌ గోవిందరాజన్, ఆయన స్నేహితులు మార్కెటింగ్‌ మేనేజర్‌ సీ సర్కార్‌లు కలిసి రూపొందించారు. ఇందులో ముఖ్యంగా ఇంటి నిర్మాణానికి స్థానికంగా లభించే వనరులను ఉపయోగించుకుంటారు. ఒక బెడ్‌రూం, కిచెన్, చిన్నపాటి హాల్‌ను కలిగి ఉండే ఈ ఇంటి నిర్మాణం కోసం గులకరాళ్లు నింపిన బ్యాగ్‌లను పునాదిగా వాడుతారు. వాటిపై రెండు వరుసల్లో ఇటుకలను పేర్చేలా ప్రాజెక్టును రూపొందించారు. ఇక గోడలుగా లావుపాటి వెదురుబొంగులను బంకమట్టిలో ముంచి వాటిని ఒకదానిపై ఒకటి పేర్చుతూ గోడల నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. ఒక పై కప్పును కూడా ఇదే విధంగా వెదురుబొంగులను బంకమట్టితో అతికించడం ద్వారా పూర్తి చేస్తారు. ఇలా రూ. 15 వేలలోనే ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసేలా ప్రాజెక్టును రూపొందించారు. ఇందుకుసంబంధించిన ప్రోటోటైప్‌ కాలనీని (మోడల్‌ కాలనీ) నిర్మించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ప్రోటోటైప్‌ కాలనీ నిర్మాణం ద్వారా ఈ తరహా భవనాల నాణ్యత, మన్నికలను పరీక్షించనున్నారు. ఈ తరహా ఇళ్లు అన్ని రకాల సురక్షితం అని తేలిన తర్వాతే పూర్తి స్థాయిలో ఇటువంటి ఇళ్ల నిర్మాణాన్ని డ్యూట్‌ స్కీ సంస్థ ప్రారంభించనుంది. ఈ తరహా ఇళ్ల నిర్మాణం గురించి సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘ఈ తరహా ఇళ్ల నిర్మాణం వల్ల సామాన్యుడి సొంతింటి కలను సులభంగా నెరవేర్చవచ్చు. అంతేకాక వీటిలో హెవీ మెటీరియల్‌ వాడటం లేదు కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రాణ నష్టం కూడా తక్కువగానే ఉంటుంది. 

Related Posts

Latest News Updates