Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

ఇంటి పైకప్పు అదిరింది

రోజురోజుకూ పెరుగుతున్న భూతాపాన్ని తట్టుకోవాలంటే ఏసీలు, కూలర్ల వాడకం తప్పటం లేదు. అయితే కొంత నేర్పుతో వ్యవహరిస్తే ఇంట్లో ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల వాడకం తగ్గించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటి పైకప్పులో ఫాల్స్‌ సీలింగ్‌ చేయించుకుంటే బెటరని అంటున్నారు. గదిలో ఆహ్లాదభరిత వాతావరణం ఏర్పర్చడమే ఫాల్స్‌ సీలింగ్‌ ప్రధాన ఉద్దేశం. అలసిన మనసు, శరీరానికి సాంత్వన చేకూర్చడమే. ఫాల్స్‌ సీలింగ్‌తో ఇంట్లోని వాతావరణాన్ని అందంగా, ఆహ్లాదంగా మార్చుకోవటమే కాకుండా సాధారణ ఇంటి పైకప్పును డైమండ్, చతురస్రం, గోళాకారం వంటి విభిన్న ఆకృతుల్లో అందంగా తీర్చిదిద్దుకోవచ్చు కూడా. 
వర్ణాల ఎంపికలో జాగ్రత్త..
గోడ రంగుతో పోల్చుకుంటే సీలింగ్‌కు వేసే వర్ణం తేలికగా ఉండాలి. అప్పుడు పైకప్పు తక్కువ ఎత్తులో ఉందనిపిస్తూ, విశాలంగా ఉన్న భావనను కలిగిస్తుంది. ముదురు షేడ్లను ఎంచుకుంటే పైకప్పు ఎత్తులో ఉందన్న అభిప్రాయాన్ని కలిగిస్తుంది. మిగతా గదులతో పోల్చుకుంటే పడకగది సీలింగ్‌నే ఎక్కువసేపు చూస్తాం కాబట్టి వర్ణాల్లో సాదాసీదావి కాకుండా నేటి పోకడలకు అద్దంపట్టేవి ఎంచుకోవాలి. మధ్యస్తం, డార్క్, బ్రౌన్‌ వర్ణాలు పడకగదికి చక్కగా నప్పుతాయి. ఎందుకంటే ఈ వర్ణాలు ఉత్సాహపరిచే విధంగా, స్వభావానికి అనుకూలంగా ఉంటాయి మరి.
ఫ్రెష్‌ లుక్‌ కోసం..
తాజాదనం ఉట్టిపడుతున్న లుక్‌ రావాలంటే మోనోక్రోమాటిక్‌ థీమ్‌ను ఎంచుకోవాలి. రెండు, మూడు వర్ణాలు కలిసినవి ఎంచుకుంటే మాత్రం అది పడకగది గోడలకు వేసిన రంగు కంటే తేలికగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీ సీలింగ్‌ ప్రశాంత భావనను కలగజేస్తుంది. గోడల రంగుకు, సీలింగ్‌కు ఒకే రకమైనవి కాకుండా.. వేర్వేరు వర్ణాల్ని కూడా వేసుకోవచ్చు. దగ్గర దగ్గర రంగులు కాకుండా, చూడగానే తేడా ఇట్టే కన్పించే వర్ణాలను ఎంపిక చేసుకోవటం మేలు. దృశ్య వ్యక్తీకరణ ప్రదేశంగా సీలింగ్‌ను వినియోగించుకోండి. ఆహ్లాదభరితమైన ఆకాశం, లేదంటే గదితో కలిసిపోయేలా ఆకట్టుకునే ఆకారాలు, వర్ణాలతో నాటకీయత కన్పించేలా అలంకరించుకోవచ్చు.
జాగ్రత్తలివే..
ఏర్పాటు చేసేటప్పుడు..
– ఫాల్స్‌ సీలింగ్‌ ఎంపికలో ధర కంటే నాణ్యతకే ప్రాధాన్యమివ్వాలి.
– ఫ్లోర్‌ నుంచి పైకప్పు మధ్య కనీసం 12 అడుగుల ఎత్తు అయినా ఉండాలి.
– ఏమరుపాటుగా ఉంటే ఫాల్స్‌ సీలింగ్‌తో పాటు ఎయిర్‌ కండిషన్‌ మెషిన్‌ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది.
– ఉడెన్‌ ఫాల్స్‌ సీలింగ్‌లో అయితే ఎలుకలతో పాటు చెదలు, పురుగులు చేరే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి.
– దుమ్ము, ధూళి చేరకుండా అప్పుడప్పుడు శుభ్రం చేయాలి.

Related Posts

Latest News Updates