Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఇల్లు + ఆఫీసు = ఐకానియా

ఆహ్లాదకరమైన వాతావరణంలో సొంతిల్లు..
ఇంటి కింది అంతస్తులోనే ఆఫీసు..
పక్క బిల్డింగ్‌లోనే కుటుంబంతో గడిపేందుకు క్లబ్‌ హౌజ్‌.. అదే బిల్డింగ్‌లో ఆసుపత్రి!
.. గృహ కొనుగోలుదారులకు ఇంతకు మించి ఏం కావాలి చెప్పండి? ఇల్లు ఒక చోట, ఆఫీసు ఇంకొక చోట, స్కూల్స్, ఆసుపత్రి వంటివి మరొక చోట ఉంటున్న ఈ రోజుల్లో.. అన్నీ రకాల వసతులు, సౌకర్యాలను ఒకే ప్రాజెక్ట్‌లో రూపుదిద్దుకుంటున్న నిర్మాణ సముదాయమే ఐకానియా.
భార్య, పిల్లలు, తల్లిదండ్రులు మనిషి జీవితంలో మోయాలనిపించే బాధ్యత. దీన్ని నేటి యువతరం ఆనందంగా ఆహ్వానిస్తోంది. కాకపోతే వాళ్లు కోరుకున్న రీతిలో నివాస సముదాయం ఉంటేనే! ఉద్యోగ రీత్యా ఒక చోట స్థిరంగా ఉండలేని నేటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు.. లైఫ్‌ జర్నీలో తల్లిండ్రులకు, భార్యాపిల్లలకు భద్రత, ఆనందం, ఆధునిక వసతులను ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇదే లక్ష్యంతో సరికొత్త ప్రాజెక్ట్‌ను తీర్చిదిద్దుతోంది ఎస్‌ఎంఆర్‌ హోల్డింగ్స్‌. నివాస, కార్యాలయ, వాణిజ్య మూడు రకాల ప్రాజెక్ట్‌లను ఐకానియా కేంద్రంగా నిర్మిస్తోంది. సింపుల్‌గా చెప్పాలంటే ఐకానియా అనేది ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌ నివాస టౌన్‌షిప్‌!
ఒక్క ప్రాజెక్ట్‌లోనే ఇల్లు, ఆఫీసు, వినోదం..
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, సెకండ్‌ లెవల్‌ ఎకనామిక్‌ గ్రోత్‌ కమ్యూనిటీ కోసం ఐకానియా పేరిట ఇంటిగ్రిటీ టౌన్‌షిప్‌ ప్రాజెక్ట్‌ను తీర్చిదిద్దుతున్నాం. దీని ప్రత్యేకత ఏంటంటే? ఒక టవర్‌లో 20 అంతస్తులుంటే.. త్రీ లెవల్స్‌ పార్కింగ్‌ కోసం, మొదటి అంతస్తులో ప్లగ్‌ అండ్‌ ప్లే బిజినెస్‌ లాబీ, మిగిలిన 19 ఫ్లోర్లలో గృహాలుంటాయి. పక్క టవర్‌లోనే ఆసుపత్రి, మెడికల్‌ షాపు, క్లబ్‌ హౌజ్‌ వంటివి సేవలుంటాయి. ప్లగ్‌ అండ్‌ ప్లే సేవలను వినియోగించుకోవాలంటే యూజర్‌ చార్జీలు చెల్లించాలి సుమీ!


కొండాపూర్‌లో 21.5 ఎకరాల్లో
కొండాపూర్‌లో 21.5 ఎకరాల్లో ఎస్‌ఎంఆర్‌ వినయ్‌ ఐకానియాను నిర్మిస్తుంది. 55 లక్షల చ.అ. బిల్టప్‌ ఏరియాలో ప్రాజెక్ట్‌ ఉంటుంది. ఇందులో 1.5 లక్షల చ.అ.ల్లో కమర్షియల్‌ స్పేస్, 1.10 లక్షల చ.అ.ల్లో రెండు క్లబ్‌ హౌజ్‌లుంటాయి. ప్రాజెక్ట్‌లో మొత్తం 15 టవర్లుంటాయి. వీటిలో 2 టవర్స్‌ని క్లబ్‌ హౌజ్, ఒక టవర్‌ కమర్షియల్, మిగిలిన 12 టవర్లను నివాసాల కోసం కేటాయించారు. ఒక్కో టవర్‌లో 20 నుంచి 30 అంతస్తులుంటాయి. మొత్తం 2,500 గృహాలు. 1,400 చ.అ. నుంచి 3,500 చ.అ. మధ్య విస్తీర్ణాలుంటాయి. 2016లో నిర్మాణ పనులు ప్రారంభం కాగా.. తొలి దశ నిర్మాణం పూర్తయింది. 6 బ్లాక్స్‌ల్లో 514 ఫ్లాట్లుంటాయి. విడతల వారీగా కొనుగోలుదారులకు అప్పగిస్తోంది. ఇప్పటికే 40కి పైగా కుటుంబాలు నివాసముంటున్నాయి కూడా!
పిల్లలు, మహిళలు, వృద్ధుల కోసం..
ఐకానియాలోని వసతులే కాదండోయ్‌ ఇందులోని ఏర్పాట్లు కూడా పిల్లలు, మహిళలు, వృద్ధులను దృష్టిలో పెట్టుకొని డిజైన్‌ చేశారు. సెంట్రల్‌ లాకింగ్, సీసీ కెమెరాల ఏర్పాట్లతో పాటూ గృహ యజమానులకు వేలిముద్ర లేదా ఐరిష్‌ యాక్సెస్‌ ఉంటుంది. దీంతో భద్రత ఎక్కువ. వృద్దులకు, మహిళలకు సహాయపడేందుకు అటెండర్స్, వీల్‌ చెయిర్స్‌తో సామాన్లు తీసుకెళ్లేందుకు ట్రాలీ వంటివి ఉంటాయి. పిల్లలు, మహిళలు, వృద్ధులు నడిచేటప్పుడు ప్రమాదాలు జరగకుండా పెడస్ట్రియన్‌ దగ్గర ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను ఏర్పాటు చేశారు. ఇంటికెవరైనా చుట్టాలు వచ్చినా లేదా పెద్ద గేటెడ్‌ కమ్యూనిటీలో మన ఇంటి దారి మరిచిపోయినా సరే కంగారు పడాల్సిన అవసరం లేకుండా ప్రతి బ్లాక్‌ ముందు రూట్‌మ్యాప్స్‌ ఉంటాయి.

గ్రీనరీకే అధిక ప్రాధాన్యం..
పార్కింగ్‌ కోసం త్రీ బేస్‌మెంట్స్‌ కలిపి 28 లక్షల చ.అ.లను కేటాయించాం. సుమారు 5 వేల కార్ల పార్కింగ్‌ చేసుకోవచ్చు. పోడియం మీద, ఓపెన్‌ స్పేస్‌లో లాన్స్, ప్లాంటేషన్, గ్రీనరీని ఏర్పాటు చేస్తుంది. ప్రాజెక్ట్‌ చుట్టూ వాక్‌ వే 1.75 కి.మీ. మేర ఉంటుంది. గ్రీనరీ వినియోగానికి రీసైక్లింగ్‌ వాటర్‌ ప్లాంట్‌ ఉంది. వినియోగించలేని స్థలంలో అల్ల నేరెడు, జామ, చింత వంటి పండ్ల చెట్లను పెంచుతామని ఎస్‌ఎంఆర్‌ హోమ్స్‌ సీఎండీ ఎస్‌. రాంరెడ్డి చెప్పారు. దీంతో కొంత కాలానికి ఈ చెట్ల మీద పక్షులు వస్తాయి. మొత్తంగా జీవ వైవిద్యాన్ని కల్పించాలన్నది మా టార్గెట్‌ అని పేర్కొన్నారు.

Related Posts

Latest News Updates