Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

ఇల్లు ఆఫీస్‌ పక్కపక్కనే

ఇల్లు ఆఫీసుకు దగ్గరగా ఉండాలి. ప్రతిరోజు ఆఫీసుకు నడుచుకుంటూ వెళ్లాలి. ‘ట్రాఫికర్‌’ భయం ఉండొద్దు. వాణిజ్యం.. వినోదం.. అందుబాటులో ఉండాలి…’ హైదరాబాద్‌లో ఇది సాధ్యమయ్యే పనేనా! మెట్రోపాలిటన్‌ ల్యాండ్‌మార్క్‌గా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్‌లో ఇలాంటి ప్రాజెక్ట్‌లకు డిమాండ్‌ పెరిగింది.ఐటీ, ఐటీఈఎస్, బీపీఓ, ఫార్మా, బయోటెక్, బ్యాంకింగ్‌ సంస్థలు, రీజినల్‌ ఆఫీసులు, కార్పొరేట్‌ కార్యాలయాలు… ఆయా సంస్థల్లో పనిచేసే నిపుణుల్ని దృష్టిలో పెట్టుకుని వీటిని నిర్మిస్తున్నారు. సాధారణ రియల్టీ ప్రాజెక్టులకు భిన్నంగా ఉంటుంది. ఇటు వాణిజ్యం.. వినోదం.. అటు ఆవాసం.. ఆహ్లాదం.. వీటన్నింటికీ కేంద్రంగా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతారు. నివాస భవనాలతో పాటూ ఆఫీస్‌ స్పేస్, షాపింగ్‌ మాల్‌ ఉంటాయి. ఇక వసతుల విషయానికొస్తే.. మాడ్యూలర్‌ కిచెన్‌తోపాటు బెడ్‌రూమ్స్‌ను ఉడెన్‌ ఫ్లోరింగ్‌తో ముస్తాబు చేస్తారు. కొన్ని నిర్మాణ సంస్థలు టెర్రస్‌పైన అత్యాధునిక స్విమ్మింగ్‌ పూల్‌తోపాటు హెలిప్యాడ్‌ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

Related Posts

Latest News Updates