Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

ఇళ్లు వద్దు.. గిడ్డంగులు ముద్దు!

ప్రస్తుతం దేశీయ నిర్మాణ రంగంలో కొత్త ట్రెండ్‌ నడుస్తోంది. ఇప్పటివరకు గృహాలు, వాణిజ్య సముదాయాల నిర్మాణాల వైపు ఆసక్తి చూపిన డెవలపర్లు.. తాజాగా వేర్‌ హౌజ్‌ (గిడ్డంగులు), పారిశ్రామిక లాజిస్టిక్స్‌ వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ–కామర్స్, రిటైల్, అపెరల్, ఎఫ్‌ఎంసీజీ, లైట్‌ ఇంజనీరింగ్‌ విభాగాలు శరవేగంగా వృద్ధి చెందుతుండటంతో దేశంలో వేర్‌ హౌజ్, లాజిస్టిక్‌ రంగాలకు డిమాండ్‌ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
డిమాండ్‌కు కారణాలెన్నో..
ఇప్పటికే గృహ నిర్మాణ రంగంలో అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ) చాలా ఉంది. పైగా డిమాండ్‌ కూడా తక్కువగా ఉంది. దీంతో డెవలపర్లు గిడ్డంగుల నిర్మాణాల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఈ రంగంలో డిమాండ్‌ క్రమంగా పెరుగుతుంది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఉత్తర్‌ ప్రదేశ్, హర్యానా, చత్తీస్‌ఘడ్‌ వంటి రాష్ట్రాలు వేర్‌ హౌజ్, లాజిస్టిక్‌ రంగాల మీద ప్రత్యేకంగా దృష్టిసారించాయి.
వేర్‌ హౌజ్, లాజిస్టిక్‌ రంగాలకు మౌలిక, పారిశ్రామిక రంగ హోదా ఇవ్వటం కూడా ఈ విభాగం డిమాండ్‌కు మరొక కారణంగా చెప్పవచ్చు. తక్కువ వడ్డీ రేట్లకు బ్యాంక్‌లు, ఆర్ధిక సంస్థలు రుణాలను మంజూరు చేస్తున్నాయి. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు తర్వాత ఈ విభాగంలో నిధుల లావాదేవీలు, సమీకరణ పారదర్శకంగా, వేగవంతంగా జరుగుతుంది. వేర్‌ హౌజ్, లాజిస్టిక్‌ విభాగంలోకి విదేశీ ప్రత్యక్ష నిధులు (ఎఫ్‌డీఐ) సమీకరించేందుకు ప్రభుత్వం కూడా నిబంధనలను సరళీకరించిన విషయం తెలిసిందే.
జాబితాలో బడా నిర్మాణ సంస్థలు..
లోధా, షాపూర్జీ పల్లోంజీ, రహేజా యూనివర్సల్, హిర్‌నందానీ, బ్రిగేడ్, ప్రెస్టిజ్‌ గ్రూప్, అసెట్జ్‌ ప్రాపర్టీ గ్రూప్‌ వంటి నిర్మాణ సంస్థలు వేర్‌ హౌజ్‌ ప్రాజెక్ట్‌లను ప్రారంభించారు. కొన్ని సంస్థలేమే సొంతంగా ప్రారంభిస్తే, మరికొన్ని అంతర్జాతీయ వేర్‌ హౌజ్‌ సంస్థలతో కలిసి సంయుక్తంగా ప్రారంభించాయి.

Related Posts

Latest News Updates