Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఈశ్వర కన్‌స్ట్రక్షన్స్‌కు 5 లక్షలు జరిమానా

ఒప్పందం ప్రకారం గడువులోగా నిర్మాణం పూర్తి చేయడంలో విఫలమైన హైదరాబాద్‌కు చెందిన ఈశ్వర కన్‌స్ట్రక్షన్స్‌కు వినియోగదారుల ఫోరం రూ.5 లక్షల జరిమానా విధించింది. జాప్యం జరిగిన కాలానికి నెలకు రూ.10 వేల చొప్పున అద్దె చెల్లించాలని ఈశ్వర కన్‌స్ట్రక్షన్స్‌ అండ్‌ డెవలపర్స్‌ యాజమాన్యాన్ని ఫోరం–3 ఆదేశించింది.
ఒప్పందం తూచ్‌..
సికింద్రాబాద్‌కు చెందిన మేడూరి శ్రీనివాసాచార్యులు దమ్మాయిగూడంలో 270 గజాల స్థలంలో నిర్మించే డూప్లెక్స్‌ ఇంటిని కొనుగోలు చేశాడు. ఇందుకోసం రుణం తీసుకొని ఈశ్వర కన్‌స్ట్రక్షన్స్‌కు రూ.29,80,000 చెల్లించాడు. ఇంటి నిర్మాణంలో భాగంగా ఫ్లోరింగ్, కిటికీలు, గ్రిల్స్, షట్టర్లు, ప్రధాన ద్వారాలు, ఎలక్ట్రిక్‌ వైర్లు, బాత్‌రూమ్‌లు వంటివి నిర్మిస్తామని సదరు కంపెనీ యాజమాన్యం వినియోగదారుడితో ఒప్పందం చేసుకుంది. కానీ, కంపెనీ హామీని నెరవేర్చడంలో విఫలమైంది. నిర్మాణ పనులను అసంపూర్తిగా వదిలేసి చేతులు దులుపుకుంది.
నిర్లక్ష్యంగా సమాధానం..
ఇదేమని ప్రశ్నించిన శ్రీనివాసాచార్యులుకు కంపెనీ ప్రతినిధులు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో బాధితుడు నగరంలోని వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. ఒప్పందం ప్రకారం కంపెనీ యాజమాన్యం నిర్మాణ పనులను పూర్తి చేయలేదని, అందుకు గాను కంపెనీ పరిహారంతో పాటూ, జాప్యం జరిగిన కాలానికి అద్దెకు కూడా చెల్లించాలని ఫోరం తీర్పునిచ్చింది. కంపెనీ ప్రతినిధి వి. మధుమోహన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఒప్పందం ప్రకారం శ్రీనివాసచార్యులు సొమ్ము చెల్లించలేదని ఫోరానికి రాత పూర్వక సమాధానం ఇచ్చారు. ఇరు పక్షాల వాదనలు విన్న ఫోరం వినియోగదారుడికే అనుకూలమైన తీర్పునిచ్చింది.

Related Posts

Latest News Updates