Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

ఉత్తమ కో–వర్కింగ్‌ కంపెనీ వర్కాఫీలా

ప్రముఖ కో–వర్కింగ్‌ కంపెనీ వర్కాఫీలా.. ‘బెస్ట్‌ కో–వర్కింగ్‌ అండ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఆఫీస్‌ స్పేస్‌’ అవార్డుకు ఎంపికైంది. 2019 సంవత్సరానికి టైమ్స్‌ బిజినెస్‌ అవార్డులను అందించిందని కంపెనీ తెలిపింది. ఈ సందర్భంగా వర్కాఫీలా ఫౌండర్‌ అండ్‌ ఎండీ గుబిందర్‌ రత్తా మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్, చెన్నై నగరాల్లో అతిపెద్ద కో–వర్కింగ్‌ స్పేస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు. 2023 నాటికి లక్ష స్టేషన్స్‌ అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యించినట్లు చెప్పారు. ప్రస్తుతం వర్కాఫీలాలో 15 వేల కో–వర్కింగ్‌ సీట్లున్నాయి. వీటిల్లో 9 వేల సీట్లు పూర్తి స్థాయిలో ఆపరేషనల్‌లో ఉన్నాయని, 6 వేల సీట్లు స్టేజ్‌ మీద ఉన్నాయని కంపెనీ తెలిపింది.

Related Posts

Latest News Updates