Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

ఎల్‌ఈడీ లైట్ల ఇస్త్రీ పెట్టె

ప్రముఖ కన్జ్యూమర్‌ డ్యూరబుల్‌ బ్రాండ్‌ ఉషా ఇంటర్నేషనల్‌ విపణిలోకి నూతన శ్రేణి ఇస్త్రీ పెట్టెను విడుదల చేసింది. కలర్‌ ఎల్‌ఈడీ లైట్లు ఐరన్‌ బాక్స్‌లో పొందుపరిచి ఉండటం దీని ప్రత్యేకత అని కంపెనీ తెలిపింది. ఉషా ఎల్‌ఈడీ ఈఐ 3810 ఎల్‌ ధర రూ.900. రెండేళ్ల వారంటీ కూడా ఉంది.


కలర్‌ను బట్టి..
కొత్త రకం ఐరన్‌ బాక్స్‌ 1000 వాట్లది కావటంతో త్వరగా వేడెక్కుతుంది. ఎరుపు రంగు లైట్‌ వెలిగినప్పుడు ఐరన్‌ బాక్స్‌ వేడి ఎక్కువైనట్టు, గ్రీన్‌ కలర్‌ వెలిగితే ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నట్లు సూచన అని కంపెనీ తెలిపింది. ఎలాంటి ఫ్యాబ్రిక్‌ ముడతలను సైతం తొలగిస్తుందని, సౌకర్యవంతమైన, ధృడమైన పట్టు కలిగి ఉంటుందని పేర్కొంది.

Related Posts

Latest News Updates