గడువులోగా అపార్ట్మెంట్ నిర్మాణాన్ని పూర్తి చేయడంలో విఫలమైన గుర్గావ్కు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ యూనిటెక్కు నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమీషన్ (ఎన్సీడీఆర్సీ) జరిమానా విధించింది. యూనిటెక్ ప్రాజెక్ట్‌లో ఫ్లాట్‌ను బుక్ చేసిన ఇద్దరు కస్టమర్లు కట్టిన సొమ్ము రూ.53 లక్షల సొమ్మును తిరిగి వెనక్కి (రీఫండ్) ఇచ్చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
గుర్గావ్ నివాసితులైన అభిషేక్, మనీ అగర్వాల్‌లు గ్రేటర్ నోయిడాలో యూనీవరల్డ్ సిటీలోని కాపెల్లా ప్రాజెక్ట్‌లో ఫ్లాట్లను బుక్ చేశారు. 2011, నవంబర్ 30 లోగా నిర్మాణం పూర్తి చేస్తామని యూనిటెక్ కొనుగోలుదారులకు అందించిన లెటర్లో తెలిపింది. కానీ, నేటికి నిర్మాణం కాలేదు. దీంతో కొనుగోలుదారులు ఎన్సీడీఆర్సీని ఆశ్రయించారు.
దావా ఖర్చు కూడా చెల్లించాల్సిందే..
మూడు నెలల సమయంలోగా రూ.53,73,561 సొమ్మును రీఫండ్ చేయాలని, ఏడాదికి 10 శాతం సాధారణ వడ్డీని కూడా చెల్లించాలని ఎన్సీడీఆర్సీ యూనిటెక్కు తెలిసింది. అంతేకాకుండా కొనుగోలుదారులకు కమీషన్లో దావా వేయడానికి అయిన ఖర్చు రూ.25 వేలను సైతం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.