Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

ఐఐటీ హైదరాబాద్‌లో కొత్త భవనాలు

ఐఐటీ హైదరాబాద్‌లో కొత్త భవనాలు రూపుదిద్దుకుంటున్నాయి. సంగారెడ్డిలోని కందిలో 576 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్‌లో కొత్తగా మరిన్ని నిర్మాణాలను చేపడుతున్నారు. ఫేజ్‌–2లో భాగంగా 1.30 లక్షల చ.అ.ల్లో ఇంటర్నేషనల్‌ గెస్ట్‌ హౌజ్, స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ కాంప్లెక్స్, టెక్నాలజీ ఇంక్యుబేషన్‌ పార్క్, టెక్నాలజీ రీసెర్చ్‌ సెంటర్‌ పార్క్, నాలెడ్జ్‌ సెంటర్, రీసెర్చ్‌ సెంటర్‌ కాంప్లెక్స్, కన్వెన్షన్‌ సెంటర్లను నిర్మితమవుతున్నాయి.
డిజైన్స్‌ బై జపాన్‌ ఆర్కిటెక్ట్‌..
ఐఐటీ హైదరాబాద్‌ ఫేజ్‌–2 నిర్మాణాలను జపనీస్‌ ఆర్కిటెక్ట్‌ ప్రొఫెసర్‌ ఓహ్నో, కవాజోలు డిజైన్‌ చేశారు. గ్రీన్‌ రేటింగ్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ హాబిటేట్‌ అసెస్‌మెంట్‌ (జీఆర్‌ఐహెచ్‌ఏ) రేటింగ్‌ 4 ప్రకారం ఉన్నవే. 2022 నాటికి ఈ భవనాలను అందుబాటులోకి తీసుకురానుంది.
2022 నాటికి అందుబాటులోకి..
నిర్మాణ పనులు ఇండో–జపాన్‌ కొలబ్రేషన్స్‌తో జరుగుతున్నాయి. రీసెర్చ్, ఇంక్యుబేషన్‌ సెంటర్లను స్టార్టప్స్, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కేటాయిస్తామని, సాకర్, క్రికెట్‌ ఫీల్డ్, బాస్కెట్‌ బాల్‌ కోర్ట్, 400 మీటర్ల ట్రాక్‌ వంటి క్రీడా ప్రాంగణాలతో పాటూ లాకర్, విశ్రాంత గదులు వంటి ఇతర ఏర్పాట్లుంటాయని ఐఐటీ హైదరాబాద్‌ తెలిపింది.

Related Posts

Latest News Updates