విద్యార్థి దశ నుంచే పర్యావరణం మీద శ్రద్ధ కలిపించాలనే ఉద్దేశ్యంతో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలోని పాఠశాలల విద్యార్థుల కోసం 13వ ‘గ్రీన్ యువర్ స్కూల్ ప్రోగ్రామ్–2019’ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), కరీర్, తొషిబా, యునైటెడ్ వే ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్లు స్పాన్సర్‌షిప్‌గా వ్యవహరిస్తున్నాయి.
ఎవరు అర్హులు?
పోటీలకు 8వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు అర్హులు. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 30. ప్రవేశం ఉచితం. మరిన్ని వివరాలకు +91 40 4418 5127, +91 404418 5113 నంబర్లలో సంప్రదించవచ్చు.
ఏం చేయాలి?
10 ఉత్తమ గ్రీన్ ఆలోచనలను గుర్తించి, పాఠశాలలో అమలు చేయాలి. గ్రీన్ ఐడియాలతో లాభాలేంటి? వాటి అమలుకు ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరముంటుంది? వంటి తదితర అంశాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేయాలి. ఫైనల్ ప్రజెంటేషన్‌ను గడువు తేదీ ముగిసే లోపు ఐజీబీసీకి పంపించాలి.
విజేతలకు ఏం ఇస్తారు?
ఎంపిక అయిన ముగ్గురు ఫైనలిస్ట్‌లకు ప్రయాణ, వసతి ఖర్చులను సీఐఐ–ఐజీబీసీ భరిస్తుంది. విజేతలకు హైదరాబాద్‌లో సెప్టెంబర్ 25–28 తేదీల్లో జరిగే గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్–2019 కార్యక్రమంలో నగదు బహుమతి, ట్రోఫీ, సర్టిఫెకట్లను ప్రదానం చేస్తారు.