ఇండియన్ ప్లంబింగ్ అసోసియేషన్ (ఐపీఏ) దేశంలో ప్లంబింగ్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే పుణే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో, కోయంబత్తూరులో శ్రీ రామకృష్ణా అడ్వాన్డ్స్ ట్రైయినింగ్ ఇనిస్టిట్యూట్ (ఎస్ఆర్ఏటీఐ)లో ల్యాబ్స్‌ను ఏర్పాటు చేసింది. 2019 ముగింపు నాటికి మరొక 2 ల్యాబ్స్‌ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం భువనేశ్వర్‌లోని సీవీ రామన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ప్లంబింగ్ ల్యాబ్ నిర్మాణంలో ఉందని ఐపీఏ తెలిపింది. గృహాలు, హోటల్స్, ఆసుపత్రి వంటి వాటిల్లో వాష్‌రూమ్స్‌ను ఎలా వినియోగించాలో వివరిస్తారు.
శుద్ధి చేసిన నీరు నిర్మాణ అవసరాలకు..
నిర్మాణ రంగం అవసరాల కోసం తాజా నీటిని బదులు శుద్ధి చేసిన లేదా వృథా నీటిని వినియోగించాలని ఐపీఏ హైదరాబాద్ చాప్టర్ తెలిపింది. హైదరాబాద్‌లో కనీసం 50 శాతం నీటిని వినియోగించే దిశగా పలువురు స్టేక్ హోల్డర్స్‌తో చర్చలు చేస్తున్నట్లు నేషనల్ ఈసీ సభ్యులు భాస్కర్ కాట్రగడ్డ, వి. శ్రీనివాస్‌లు తెలిపారు. ‘ఐ సేవ్ వాటర్’ క్యాంపెయిన్‌లో భాగంగా ఈ ఏడాది 130 కోట్ల లీటర్ల నీటిని ఆదా చేయాలని లక్ష్యించినట్లు పేర్కొన్నారు.
5250 మంది సభ్యుల లక్ష్యం..
1993లో ప్రారంభమైన ఐపీఏలో 22 చాప్టర్లలో కలిపి 4 వేల మంది సభ్యులున్నారు. 2019 ముగింపు నాటికి సభ్యుల సంఖ్యను 5250లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా దేశీయ ప్లంబింగ్ రంగాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని సభ్యులు పేర్కొన్నారు.