Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

కమలిస్తాన్‌ స్థానంలో కార్యాలయాలు!

మహల్, పాకీజా, రజియా సుల్తాన్, అమర్‌ అక్బర్‌ ఆంటోనీ, కాలియా, ఖల్‌నాయక్‌ వంటి ఎన్నో హిట్‌ కొట్టిన హిందీ సినిమాలకు క్లాప్‌ కొట్టింది కమల్‌ పిక్చర్స్‌ (మహల్‌ ఫిల్మ్స్‌) స్టూడియోలోనే!
.. 60 సంవత్సరాల పురాతన ఈ స్టూడియో స్థానంలో తాజాగా అతిపెద్ద కార్యాలయాల సముదాయం నిర్మాణానికి పునాదిరాయి పడింది.
రూ.21 వేల కోట్లతో నిర్మాణం..
ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు ఆర్‌ఎంజెడ్‌ గ్రూప్, డీబీ రియాలిటీ లిమిటెడ్, అవినాష్‌ భోష్లే కన్‌స్ట్రక్షన్‌ ప్రై.లి. (ఏబీఐఎల్‌) మూడు సంస్థలు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయనున్నట్లు తెలిసింది. ఆర్‌ఎంజెడ్‌ గ్రూప్‌నకు 55 శాతం వాటా, స్టూడియో ఓనర్లు అయిన భోష్లే, డీబీ రియాల్టీకి 45 శాతం వాటా ఉంది. ఈ ప్రాజెక్ట్‌ వాల్యూ 3 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.21 వేల కోట్లు) అని సమాచారం.
లే అవుట్‌ అనుమతి కూడా ఓకే..
సుమారు 70 లక్షల చదరపు అడుగుల్లో ముంబైలోనే అతిపెద్ద వాణిజ్య కార్యాలయ సముదాయాన్ని నిర్మించనున్నాయి. ప్రభుత్వం నుంచి లే అవుట్‌ ప్లాన్‌ కూడా అనుమతి కూడా వచ్చింది. ఈ ఏడాది ముగింపు నాటికి ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని అంచనా. 5–7 ఏళ్లలో నిర్మాణం పూర్తవుతుందని.. సుమారు 1.25 లక్షల మంది కార్మికులు అవసరం ఉంటుందని సమాచారం.

Late filmmaker Kamaal AmrohiÕs Kamalistan studio in Jogeshwari, who built the studio in 1958. Express photo by Prashant Nadkar, Saturday 08th September 2018, Mumbai, Maharashtra.

ప్రముఖ సినీ దర్శకులు, స్క్రీన్‌ రైటర్‌ కమల్‌ ఆమ్రోహీ 1958లో ముంబైలోని జోగేశ్వరీ – విక్రోలీ లింక్‌ రోడ్‌లో కమలిస్తాన్‌ స్టూడియోను స్థాపించారు. 15 ఎకరాల్లో దీన్ని నిర్మించారు. 2010 అక్టోబర్‌లో కమల్‌ ఆమ్రోహీ ముగ్గురు పుత్రులు.. రూ.200 కోట్లకు స్టూడియోలోని కొంత భాగాన్ని ముగ్గురు డెవలపర్లకు (డీబీ రియాలిటీ, అవినాశ్‌ భోష్లే గ్రూప్, ఇతరులకు) విక్రయించిన విషయం తెలిసిందే. తాజాగా కమలిస్తాన్‌ స్టూడియో ప్రాంతంలో భారీ ఆఫీస్‌ స్పేస్‌ పార్క్‌ ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.

Related Posts

Latest News Updates