కబ్జాదారులకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. కంటపడిన ఖాళీ స్థలాలను, నాలాలను ఆక్రమించే కబ్జాదారులను బంజారాహిల్స్‌లో ఏకంగా కరెంట్ స్తంభాన్నే ఆక్రమించేశాడు. అది కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ పక్కనే అయిన అధికారులు పట్టించుకోకపోవటం కొసమెరుపు.
మోర్ మోడికల్స్ మాయ..
బంజాహిల్స్ రోడ్ నెం. 12 ప్రధాన రహదారిలో కొత్తగా నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ బిల్డింగ్ సమీపంలో మోర్ మెడికల్స్ భవన యజమాని కరెంటు స్తంభాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టాడు. ఈ కరెంటు స్తంబానికే బంచ్ కేబుల్స్ కూడా ఏర్పాటు చేశారు. బయటకు మాత్రం ఈ కరెంటు స్తంభం కనిపించకుండా నిర్మాణాలను చేపట్టి దర్జాగా ఫుట్‌పాత్‌ను కూడా ఆక్రమించాడు. జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులకు ఎన్నోసార్లు స్థానికులు ఫిర్యాదులు చేసినా ఏ ఒక్కరు పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. ఓ వైపు కరెంటు స్తంబాన్ని ఆక్రమించి ఇంకోవైపు ఫుట్‌పాత్‌ను దర్జాగా కబ్జా చేసినా అటు విద్యుత్ శాఖ అధికారులు, ఇటు జీహెచ్ఎంసీ అధికారులు అటువైపు తొంగిచూడటం లేదు. ఫలితంగా ఇక్కడ కబ్జాలపర్వం జోరుగా సాగుతున్నది. మోర్ మెడికల్స్పక్కనే ఇంటి యజమాని సెట్‌బ్యాక్‌లో అయిదు మడిగెలు వేసి దర్జాగా కిరాయిలకు ఇచ్చుకున్నాడు.