Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

కర్నూల్‌లో ఎకనామిక్‌ సిటీ

మెట్రో నగరాలకు మాత్రమే పరిచయమైన పని దగ్గరే ఇల్లు (వాక్‌ టు వర్క్‌) కల్చర్‌ ద్వితీయ శ్రేణి పట్టణాలకూ పాకింది. దీని ప్రత్యేకత ఏంటంటే.. మెరుగైన మౌలిక వసతులతో పాటూ ఇంటికి దగ్గర్లోనే పని ప్రదేశం, స్కూల్, ఆసుపత్రి, సూపర్‌ మార్కెట్, సినిమా హాల్‌.. ఇలా ప్రతీ ఒక్కటీ ఉంటుందన్నమాట. ఇలాంటి ప్రాజెక్ట్‌లను కర్నూలు వాసులకూ పరిచయం చేసేందుకు సిద్ధమైంది రాగమయూరి నిర్మాణ సంస్థ. ఎకనామిక్‌ సిటీ పేరిట త్వరలోనే ప్రారంభంకానున్న ప్రాజెక్ట్‌ ప్లాన్‌ చేస్తోంది.

– నన్నూరు గ్రామంలో 182 ఎకరాల్లో ఎకనామిక్‌ సిటీని అభివృద్ధి చేస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే.. వ్యక్తిగత గృహాలతో పాటూ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలకు ప్రత్యేకంగా స్థల కేటాయింపులుంటాయి. ఎందుకంటే అల్పాదాయ వర్గాలతో పాటూ దిగువ, మధ్యతరగతి ప్రజలకు ఒకే చోట సొంతిల్లు కల్పించడంతో పాటూ వాళ్లు పనిచేసుకునేందుకు వీలుగా ఎంఎస్‌ఎంఈ యూనిట్లూ ఉంటాయి. పైగా ప్రధాన్‌మంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) పథకం కింద గృహ సబ్సిడీ కూడా పొందే వీలుంటుంది.

– 182 ఎకరాల్లో ఎకనామిక్‌ సిటీలో.. 135 ఎకరాలు గృహాలకు, 47 ఎకరాలు పరిశ్రమలకే కేటాయించింది. ఫేజ్‌–1లో 40 ఎకరాల్లో గృహాలను, 10 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ స్థలాన్ని అభివృద్ధి చేస్తుంది ఎకనామిక్‌ సిటీలో మొత్తం 8,960 యూనిట్లుంటాయి. తొలి దశలో మొత్తం 1,500 వ్యక్తిగత గృహాలొస్తాయి.

– ఈడబ్ల్యూఎస్‌ గృహాలు 73 గజాల్లో 430 చ.అ. బిల్టప్‌ ఏరియాలో ఉంటుంది. ఇవి మొత్తం 4,640 యూనిట్లుంటాయి. ఎల్‌ఐజీ ఇళ్లు 133 గజాల్లో 650 చ.అ. బిల్టప్‌ ఏరియాలో ఉంటాయి. 1,680 యూనిట్లుంటాయి. ఎంఐజీ ఇళ్లు 170 గజాల్లో 850 చ.అ. బిల్టప్‌ ఏరియాలో ఉంటాయి. ఇవి 2,640 గృహాలుంటాయి. వ్యక్తిగత గృహాలతో పాటూ 300 చ.అ., 430 చ.అ.ల్లో అపార్ట్‌మెంట్లను కూడా ఉంటాయి.

Related Posts

Latest News Updates