కీసర మండలంలో 46 అక్రమ లే–అవుట్లు వెలిశాయి. కీసర గ్రామంలో 16, కరీంగూడలో 1, గోధుమకుంటలో 5, చీర్యాలలో 10, అంకిరెడ్డిపల్లిలో 4, భోగారంలో 4, యాద్గార్‌పల్లిలో 2 అక్రమ లే–అవుట్లను గుర్తించినట్లు ఈఓపీఆర్డీ యుగేందర్ రెడ్డి అన్నారు. ఆయా లే–అవుట్లలో ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
నోటీసుల జారీ..
కీసర మండలంలోని వివిధ గ్రామాల్లో వెలసిన అక్రమలేఔట్లలో ఇప్పటికే పలుమార్లు కూల్చివేతలు చేపట్టి, సదరు యజమానులకు నోటీసులు కుడా జారీ చేయడం జరిగిందన్నారు. అయినప్పటికి అక్రమలేఔట్లు తయ్యారుచేసే వ్యక్తులు తమ అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ యం.వి.రెడ్డి, డీపీఓ రవికుమార్ ఆదేశాల మేరకు మండలంలోని వివిధ గ్రామాల్లో అక్రమలే ఔట్లలో రిజిస్ట్రేషన్లు కాకుండా సబ్‌రిజిస్టార్ కార్యాలయానికి నివేదిక అందజేయడ జరుగుతుందన్నారు.