Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

కేసీఆర్‌ సారూ! దివ్యాంగులకు డబుల్‌ కేటాయింపులేవీ?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్టాత్మక పథకమైన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కేటాయింపుల్లో దివ్యాంగులకు 5 శాతం ప్రత్యేక కేటాయింపులు చేయాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి డిమాండ్‌ చేసింది. వాస్తవానికి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో 5 శాతం దివ్యాంగులకు కేటాయించాలని ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ అది కార్యరూపం దాల్చడం లేదు.
తహశీల్దార్‌కు వినతీపత్రం..
మల్కాజిగిరి దివ్యాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు ఎన్‌.వినయ్‌ ఆధ్వర్యంలో దివ్వాంగులు నేరేడ్‌మెట్‌లోని మల్కాజిగిరి తహసీల్దార్‌ బీ.గీతను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. మల్కాజిగిరి మండలంలో సుమారు 18 వందల మంది ఉన్నామని, ఇందులో చాలా మందికి సొంత ఇళ్లు లేవని దివ్యాంగులు తహసీల్దార్‌కు దృష్టికి తీసుకొచ్చారు. జీవో ప్రకారం ఇళ్లను మంజూరు చేసి, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను కింది అంతస్తులో కేటాయించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని దివ్యాంగులు తహసీల్దార్‌ను కోరారు.

Related Posts

Latest News Updates