Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

కేసీఆర్‌ 2 బీహెచ్‌కేలకు స్మార్ట్‌ ఇన్‌ఫ్రా నాణ్యత పరీక్షలు

నిర్మాణ రంగంలో సివిల్‌ ఇంజనీర్లకు ఉపాధి, నైపుణ్యాన్ని పెంచడమే లక్ష్యంగా సేవలందిస్తున్న స్మార్ట్‌ ఇన్‌ఫ్రా– ఈఎస్‌టీ ట్రస్ట్‌.. ఈ ఏడాది ఉచిత ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమానికి తెలంగాణలో ప్రతిష్టాత్మక గృహ నిర్మాణ పథకమైన కేసీఆర్‌ 2 బీహెచ్‌కే నిర్మాణాలను ఎంపిక చేసింది. దేశంలోని వివిధ నగరాల్లోని 350 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేరకు స్మార్ట్‌ ఇన్‌ఫ్రా–ఈఎస్‌టీ ట్రస్ట్‌ జీహెచ్‌ఎంసీతో ఒప్పందం చేసుకుంది.


విద్యార్థులు ఏం చేస్తారంటే?
హైదరాబాద్‌లోని ఐదు డివిజన్లలోని జరుగుతున్న 2 బీహెచ్‌కే గృహ నిర్మాణాలను ఈ విద్యార్థులు భౌతికంగా పర్యవేక్షించి.. నాణ్యత పరీక్షలను నిర్వహిస్తారు. ప్రొఫిషనల్స్‌ స్థాయిలో నిర్మాణంలోని ప్రతి దశలో నాణ్యతలను నిర్ధారించి, జాబితాను రూపొందిస్తారు. స్మార్ట్‌ ఇన్‌ఫ్రా–ఈఎస్‌టీ ట్రస్ట్‌ ప్రతి ఏటా సివిల్‌ ఇంజనీర్లకు ఉచితంగా ఇంటర్న్‌షిప్‌ను అందిస్తుందని స్మార్ట్‌ ఇన్‌ఫ్రా ట్రస్ట్‌ ఫౌండర్, మెంటార్‌ పి. సూర్య ప్రకాశ్‌ తెలిపారు. సివిల్‌ ఇంజనీరింగ్‌ మూడో సంవత్సరం, ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు.

Related Posts

Latest News Updates