Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

కో–లివింగ్‌తో జేబులోకి ఆదాయం

దేశీయ రెసిడెన్షియల్‌ భవనాల మార్కెట్‌లో అద్దె రాబడులు అన్నవి ప్రపంచంలోనే చాలా తక్కువగా ఉన్నాయి. ఈ అద్దె రాబడి సగటున 2–3 శాతంగా ఉంది. అంటే రూ.50 లక్షల విలువ కలిగిన ఇంటిపై వచ్చే అద్దె ఆదాయం మహా అయితే రూ.9,000–12,000 మధ్య ఉంటుంది. అయితే, ఈ మధ్య కాలంలో కో–లివింగ్, పర్యాటకులకు అద్దెకు ఇవ్వడం అనే కొత్త నమూనాలు పుట్టుకొచ్చాయి. వీటిని ఆశ్రయించడం వల్ల యజమానులకు కాస్త అధిక రాబడులు అందుకోవడానికి అవకాశం ఉంది. ‘‘నూతన నమూనాల్లో ముఖ్యంగా కోలివింగ్‌ రూపంలో అద్దె రాబడి 8 శాతం (ఇంటి విలువపై) వరకు వచ్చే అవకాశం ఉంది. నేరుగా అద్దెకు ఇవ్వడం వల్ల వచ్చే 3 శాతం కంటే ఎంతో ఎక్కువ’’ అని మ్యాజిక్‌బ్రిక్స్‌ సీఈవో సుధీర్‌పాయ్‌ పేర్కొన్నారు. మరింత అద్దె ఆదాయం కోరుకునే వారికి ఈ నమూనాలు ఉపకరిస్తాయి. అయితే, ఈ రెండు నమూనాల్లోనూ వాటికంటూ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. వీటి కింద ఇళ్ల యజమనాలు అందరూ అధిక ఆదాయం తెచ్చుకునే అవకాశం ఉంటుందని కూడా చెప్పలేం. ఎందుకంటే పర్యాటకులకు అద్దెకు ఇచ్చే నమూనా కింద అధిక ఆదాయం కోరుకునే వారు… వారి ఇల్లు ఏ ప్రాంతంలో ఉన్నదీ కీలక పాత్ర పోషిస్తుంది. పట్టణానికి మధ్య భాగంలో ఉందా లేక పర్యాటకు ప్రదేశాలకు సమీపంలో ఉందా అన్నవి చూడాల్సి ఉంటుంది.

‘‘కో లివింగ్‌లో నమూనాలో ఇంటి విస్తీర్ణం పెద్దగా ఉండాలి. మొత్తం ఇంట్లో కనీసం 50–60 గదులు ఉండాలి’’ అని బెంగళూరుకు చెందిన కోలివ్‌ సంస్థ సీఈవో సురేష్‌ రంగరాజన్‌ పేర్కొన్నారు. ఇల్లు ఎక్కుడ ఉంది, ఏ తరహా ప్రాపర్టీ అనే అంశాల ఆధారంగా ఇంటి యజమాని కోలివింగ్, పర్యాటలకు అద్దెకు ఇవ్వడంలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది. అలాగే, రోజువారీ కార్యకలాపాల్లో తమ పాత్ర, పెట్టుబడి వంటి అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
50 శాతం అధికంగా…
కో లివింగ్‌ విధానాన్ని ఎంచుకోవడం ద్వారా ఇంటి యజమాని తన అద్దె అదాయాన్ని 50 శాతం, లేదా అంతకుమించి పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. ‘‘కో లివింగ్‌ విభాగంలో కంపెనీలు విడి భవనాలకు ప్రాధాన్యం ఇస్తాయి. ఎందుకుంటే వీటిని తమ అవసరాలకు అనుగుణంగా మార్పు చేసుకోవడం సులభం. ఐటీ పార్క్‌లు, వ్యాపార జిల్లాలు, కార్యాలయ కేంద్రాల్లోని భవనాలకు ఎక్కువ ఆసక్తి చూపుతాయి. రిస్క్‌ తీసుకోని యజమానులు అయితే స్థిరమైన అద్దె విధానాన్ని ఎంచుకోవచ్చు. రిస్క్‌ తీసుకునే వారు అయితే అధిక ఆదాయం కోసం ఆదాయ పంపిణీ (వచ్చిన ఆదాయంలో కంపెనీకి, యజమానికి ఇంతని వాటా)విధానాన్ని కూడా ఎంచుకునే అవకాశం ఉంది. ఇంటి యజమానులతో కో లివింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు 10 ఏళ్ల దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకుంటుంటాయి. నిర్వహణ, పోలీసుల ద్రువీకరణ, అద్దెకు ఉండే వారితో లావాదేవీల వ్యవహారాలన్నీ కంపెనీలే చూసుకుంటాయి. ఇంటి యజమానిపై ప్రత్యేక బాధ్యతలు ఏమీ ఉండవు.
పర్యాటకులకు అద్దెకిచ్చేట్టు అయితే…
ఎయిర్‌బీఎన్‌బీ, ఓయో ప్లాట్‌ఫామ్‌లు అయితే ఇంటి యజమానులు తమ ప్రాపర్టీలను స్వల్ప కాలం పాటు అద్దెకు ఇచ్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. స్వల్పకాలం పాటు విడిది చేసే పర్యాటకులకు ఈ సంస్థలు అద్దెకు ఇచ్చుకునే వేదికగా నిలుస్తున్నాయి. ప్రాంతం లేదా ఇంటి విస్తీర్ణం విషయంలో ఈ విధానంలో నియంత్రణలు ఉండవు. ఒక గదిని కూడా అద్దెకు ఇచ్చుకోవచ్చు. ఎయిర్‌బీఎన్‌బీ వంటి సంస్థలు ఆదాయంలో ఇంటి యజమానికి ఎక్కువ వాటా ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. కాకపోతే, ఇంటి యజమాని పాత్ర ఎక్కువ ఉండాలి. తమ ఇంటిని మార్కెటింగ్‌ చేయడం, సందర్శకుల అవసరాలకు తగినట్టుగా ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. మీనాక్షి దహియా ఎయిర్‌బీఎన్‌బీకి సూపర్‌ హోస్ట్‌గా ఉన్నారు. అంటే ఎక్కువ మంది టాప్‌ రేటింగ్‌ ఇవ్వడం వల్ల ఆమెకు ఈ హోదా లభించింది. ఆమెకు మూడు ప్రాంతాల్లోని ఇళ్లలో 55 గదులు ఉన్నాయి. వీటి ద్వారా ఆమె అంతకుముందుతో పోలిస్తే 140 శాతం అధికంగా ఆదాయం పొందుతున్నట్టు ఆమే స్వయంగా తెలిపారు. ‘‘ఎయిర్‌బీఎన్‌బీలో ప్రొఫైల్‌ నిర్మించుకునేందుకు సమయం తీసుకుంటుంది. కానీ, సందర్శకులు ఆతిథ్యం ఇచ్చిన వారికి అధిక రేటింగ్‌ ఇవ్వడం మొదలైతే వ్యాపారం వద్ధి చెందుతుంది. సందర్శకుల నుంచి అభిప్రాయాలను తీసుకోవడం ద్వారా నా ఇంటిలోమార్పులు చేస్తుంటాను’’ అని దహియా తెలిపారు. ఎయిర్‌బీఎన్‌బీలో ప్రతీ బుకింగ్‌పై చెల్లించే మొత్తం నుంచి 3 శాతాన్ని చార్జ్‌గా వసూలు చేస్తోంది.

Related Posts

Latest News Updates