Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

కో–వర్కింగ్‌ స్పేస్‌లోకి ఓయో

హోటల్‌ రూమ్‌ అగ్రిగేటర్‌ స్టార్టప్‌ ఓయో.. కో–వర్కింగ్‌ స్పేస్‌ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఓయో వర్క్‌ప్లేస్‌లను కో–వర్కింగ్‌ సేవలుగా వినియోగించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఓయోకు 10 నగరాల్లో 21 వర్క్‌ప్లేస్‌ స్టేషన్లలో 15 వేలకు పైగా సీట్లున్నాయి. ఈ ఏడాది ముగింపు నాటికి 50 సెంటర్లకు విస్తరిస్తామని కంపెనీ తెలిపింది.
రెండు కొత్త బ్రాండ్స్‌..
ఓయో తాజాగా కోవర్కింగ్‌ సంస్థ ఇన్నోవ్‌8 కంపెనీని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పాటూ మార్కెట్లోకి పవర్‌స్టేషన్, వర్క్‌ఫ్లో పేరిట రెండు కొత్త కో–వర్కింగ్‌ స్పేస్‌ బ్రాండ్లను విడుదల చేసింది. ప్రస్తుతం ఇన్నోవ్‌8కు ఢిల్లీ, నోయిడా, గుర్గావ్, చండీఘడ్, ముంబై నగరాల్లో 16 సెంటర్లలో 6 వేల సీట్లున్నాయి. స్విగ్గీ, పేటీఎం, పెప్సీ, నైకా, ఓఎల్‌ఎక్స్, లెన్స్‌కార్ట్‌ వంటి కంపెనీలు ఇన్నోవ్‌8కి కస్టమర్లుగా ఉన్నాయి. పవర్‌స్టేషన్‌కు గుర్గావ్‌లోని ఒక సెంటర్‌లో వెయ్యి సీట్లున్నాయి. వర్క్‌ఫ్లోకు ఎన్‌సీఆర్, హైదరాబాద్, బెంగళూరులో నాలుగు సెంటర్లలో కలిపి 1,500 సీట్లున్నాయి.

Related Posts

Latest News Updates