కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) హైదరాబాద్ చాప్టర్కు కొత్త ప్రెసిడెంట్ రానున్నారు. ప్రస్తుతం జనరల్ సెక్రటరీగా ఉన్న పి. రామకృష్ణ రావు కొత్త అధ్యక్షుడిగా నియమితులుకానున్నారు. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న ఎస్ఎంఆర్ బిల్డర్స్ సీఎండీ ఎస్. రాంరెడ్డి పదవీ కాలం ఈ నెల 25తో ముగియనుంది. త్వరలోనే క్రెడాయ్ హైదరాబాద్ కార్యవర్గం విలేకరుల సమావేశం నిర్వహించి అధికారికంగా వెల్లడించనున్నారు.
మన్భూమ్ కన్స్ట్రక్షన్స్ ఫౌండర్..
కొత్త ప్రెసిడెంట్గా ఎంపిక కానున్న పి. రామకృష్ణా రావు మన్భూమ్ కన్స్ట్రక్షన్స్ కో ప్రై.లి. ఫౌండర్. 1999లో ప్రారంభమైన క్రెడాయ్కు ప్రస్తుతం జాతీయ స్థాయిలో 23 రాష్ట్రాల్లోని 156 చాప్టర్లున్నాయి. సుమారు 11,500 మంది సభ్యులున్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని లుంబిని జువెల్ మాల్ నాల్గవ అంతస్తులో క్రెడాయ్ హైదరాబాద్ కార్యాలయం ఉంది.