ది కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) హైదరాబాద్ చాప్టర్‌కు కొత్త కార్యవర్గం ఎన్నికైంది. 2019–21 సంవత్సరానికి గాను క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్‌గా పి. రామకృష్ణ, జనరల్ సెక్రటరీగా వి. రాజశేఖర్ రెడ్డిలు నియమితులయ్యారు.
ఇతర సభ్యులు వీళ్లే..
వైస్ ప్రెసిడెంట్స్‌గా సి. మురళీ మోహన్, కె. రాజేశ్వర్, వి. వేణు వినోద్, ఎన్. జయదీప్ రెడ్డిలు, ట్రెజరర్‌గా ఆదిత్య గౌరా, జాయింట్ సెక్రటరీలుగా శివరాజ్ ఠాకూర్, కె. రాంబాబులు ఎన్నికయ్యాయి. కార్మికుల నైపుణ్య శిక్షణ, నిర్మాణంలో ప్రమాణాలు, కొనుగోలుదారుల సంతృప్తి వంటి వాటిపై హైదరాబాద్ కొత్త కార్యవర్గం దృష్టిసారిస్తుందని తెలిపారు.