Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

ఖైదీలు ఇండ్లు కడతరంట!

పరిశ్రమలు, పెట్రోల్‌ బంక్‌ల వ్యాపారంలో సక్సెస్‌ అవుతున్న తెలంగాణ జైళ్ల శాఖ మరొక వ్యాపారం మీద కన్నేసింది. మూడు పువ్వులు ఆరు కాయలుగా లాభాలను గడిస్తున్న రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఉవ్విళ్లూరితోంది. జైళ్లలోని ఖైదీలకు నిర్మాణ రంగ పనుల్లో నైపుణ్యం ఉండటంతో వారి స్కిల్స్‌ను వినియోగించుకోవాలని నిర్ణయించింది.
వరంగల్, హైదరాబాద్‌లో..
తెలంగాణలో వరంగల్, హైదరాబాద్‌లో రెండు చోట్ల హౌజింగ్‌ సొసైటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒక్కో హౌజింగ్‌ సొసైటీకి దాదాపు 20 ఎకరాల స్థలం అవసరం అవుతుందని అంచనా. ఇప్పటికే వరంగల్, హైదరాబాద్, శంషాబాద్, శ్రీశైలం జాతీయ రహదారిలో స్థలాలను జైళ్ల శాఖ ఉన్నతాధికారులు పరిశీలించారని, అనువైనం స్థలం దొరకగానే ఆ భూముల్లో హౌజింగ్‌ సొసైటీలను నిర్మాణాలు ప్రారంభమవుతాయని తెలిసింది.
ఖైదీల్లో స్కిల్స్‌..
ఇప్పటికే పలు ఖైదీలు నిర్మాణ రంగం, ఎలక్ట్రిసిటీ, కార్పెంటర్, పెయింటింగ్, ప్లంబింగ్‌ వంటి నిర్మాణ పనుల్లో నైపుణ్యం సాధించారు. వీరి నైపుణ్యాలను సద్వినియోగం చేసుకోవాలని
ఖైదీలకు అనుభవం, మానవ వనరుల వినియోగం రెండు విధాలా మంచి ఫలితాలు సాధించాలన్నది జైళ్ల శాఖ ప్రతిపాదన. ప్రభుత్వ అనుమతి కోసం జైలు ఉన్నతాధికారులు, మాజీ ఉద్యోగులతో కలిసి నివేదికను రూపొందిస్తున్నారని సమాచారం.

తక్కువ ధరకే గృహాలు..
తెలంగాణ జైళ్ల శాఖ కేసీఆర్‌ 2 బీహెచ్‌కే గృహాల మాదిరిగా భారీ గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తుంది. తక్కువ ధరలకే ఇండ్లను పేదలకు అందిస్తుంది. హౌజింగ్‌ సొసైటీల ద్వారా వరంగల్, హైదరాబాద్‌లో జైళ్ల సిబ్బందికి సొంత ఇళ్లు అందించనుంది. పలు భారీ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలతో ఒప్పందం లేదా ప్రభుత్వ ఆర్డర్ల ప్రకారం భారీ నిర్మాణాలను కూడా చేపడుతుంది. తెలంగాణ జైళ్ల 2020 నాటికి రూ.100 కోట్ల ఆదాయం, 2025 నాటికి రూ.200 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.

Related Posts

Latest News Updates