Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

గడువులోగా ప్రాజెక్ట్‌ పూర్తి చేయలేదా? ఫ్లాట్, వడ్డీ రెండూ పొందొచ్చు!

సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. దాన్ని సాకారం చేసుకునేందుకు కొనుగోలుదారులు ఆత్రుత పడుతుంటారు. దీన్ని ఆసరా చేసుకొనే కొంత మంది డెవలపర్లు తప్పుడు హామీలతో కస్టమర్లను నట్టేట ముంచుతుంటారు. ఫ్లాట్‌ ఖరీదులో సగానికి పైగా సొమ్ము చెల్లింపు చేసేసి.. గృహ ప్రవేశం కోసం ఎదురుచూసే కొనుగోలుదారులు దేశంలో లక్షల్లో ఉంటారు. నిర్మాణ గడువు ముగిసినా సరే ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడంలో డెవలపర్లు విఫలమవుతున్నారు. తాజాగా ఇలాంటి కేసులో నేషనల్‌ కన్జ్యూమర్‌ డిస్‌ప్యూట్‌ రిడ్రెసల్‌ కమీషన్‌ (ఎన్‌సీడీఆర్‌సీ) సంచలన తీర్పును ఇచ్చింది.
హర్యానాలోని అర్రీస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, 3సీ సంయుక్త ప్రాజెక్ట్‌ గ్రీన్‌పొలీస్‌లో ఢిల్లీకి చెందిన షాలబ్‌ నిగమ్‌ ఫ్లాట్‌ను బుక్‌ చేశాడు. ఫ్లాట్‌ ఖరీదు కోటి రూపాయలు కాగా.. రూ.90 లక్షలు చెల్లించేశాడు కూడా. ఒప్పందం ప్రకారం డెవలపర్‌ 36 నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేయాలి. గ్రేస్‌ పీరియడ్‌ 6 నెలలు కూడా ముగిసినా సరే బిల్డర్‌ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడంలో విఫలమయ్యాడు. దీంతో నిగమ్‌ కోర్ట్‌ను ఆశ్రయించాడు.
ఫ్లాట్, 6 శాతం వడ్డీ రెండూ..
అయితే కొనుగోలుదారుడు నిగమ్‌.. ఫ్లాట్‌ స్వాధీనం చేసుకోవటానికే ప్రాధాన్యత ఇవ్వటంతో ఎన్‌సీడీఆర్‌సీ బిల్డర్‌ను నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించింది. 2019 సెప్టెంబర్‌ నాటికి ఫ్లాట్‌ను అందించాలని ఆదేశించింది. అంతేకాదండోయ్‌.. నిగమ్‌కు ఫ్లాట్‌ను అందజేశాక, గతంలో ఆయన చెల్లించిన సొమ్ము మీద డెవలపర్‌ ఏడాదికి 6 శాతం చొప్పును వడ్డీని చెల్లించాలని ఆదేశించింది. ఒకవేళ తాజా గడువు పొడిగింపు సెప్టెంబర్‌ నాటికి పూర్తి చేయని పక్షంలో ఏడాదికి 10 శాతం వడ్డీని చెల్లించాలని తీర్పు ఇచ్చింది.

Related Posts

Latest News Updates