గృహ ప్రవేశం కోసం సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న వేలాది మంది గృహ కొనుగోలుదారులకు ఊరట లభించింది. రెండేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న ఆమ్రపాలి, జైపీ, యూనిటెక్ వంటి దేశీయ రియల్ ఎస్టేట్ సంస్థల కేసులను పరిష్కారం లభించింది.
గృహ ప్రవేశం కోసం కొన్ని సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న కొనుగోలుదారులకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. నిర్మాణం పూర్తయ్యే వరకూ ఎదురు చూడటం లేదా కట్టిన సొమ్మును తిరిగి వెనక్కి (రీఫండ్) తీసుకొని ఎగ్జిట్ అవటం!
ఎదురుచూసే ఆప్షన్‌ను ఎంచుకుంటే?
ఒకవేళ మీరు ఎదురుచూసే ఆప్షన్‌ను ఎంచుకుంటే గనక.. డెవలపర్‌కు పరిశ్రమ మంచి పేరు, చరిత్ర ఉన్నట్లయితే.. నిర్మాణ గడువు ముగిసినా సరే ప్రాజెక్ట్‌ను పూర్తి చేయకుండా మీ సహనాన్ని పరీక్షించిన డెవలపర్‌కు మరొక అవకాశం ఇవ్వటం ఉత్తమం. ఆర్ధిక, కార్యాలయాల లేదా ఇతరత్రా ఇబ్బందులతో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయకపోవచుచ్చు. మీరు కొనుగోలు చేసే సమయానికి ప్రస్తుత మార్కెట్ రేటు తేడా గమనించవచ్చు మీరు ఎంపిక చేసిన ప్రాజెక్ట్ ప్రాంతం అభివృద్ధి చెందే ప్రాంతంలో ఉన్నట్లయితే మరికొంత వేచి చూసే ఆప్షన్‌ను ఎంచుకోవటం ఉత్తమం. డెవలపర్‌తో ముందుగా ఈ విషయాన్ని చర్చించి.. ప్రాజెక్ట్‌ను పూర్తి చేసేలా ఒప్పందం చేసుకోవటం మంచిది
ఒకవేళ రీఫండ్ తీసుకుంటే?
ఒకవేళ పూర్తిస్థాయి ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన డెవలపర్ అయితే ఎగ్జిట్ కావటమే ఉత్తమం. ప్రాజెక్ట్ ప్రాంతం శివారు ప్రాంతాల్లో, కన్జర్వేషన్ జోన్లో ఉన్నా సరే రీఫండ్ తీసుకోవటమే ఉత్తమం. రీఫండ్ సొమ్ముతో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్ట్‌లో కొనుగోలు చేసి సొంతింటి కలను సాకారం చేసుకోవటం ఉత్తమం.