తెలంగాణ నూతన సచివాలయం, శాసన సభ భవనాల శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. రేపు గురువారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుటుంబ సమేతంగా కొత్త సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలకు భూమి పూజ చేయనున్నారు.
ఈశాన్యంలో భూమి పూజ..
సెక్రటేరియట్లో ఈశూన్యంలో డీ బ్లాక్ వెనక వైపు ఉన్న ఉద్యానవనంలో భూమి పూజ చేసేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. సెక్రటేరియట్లో భూమి పూజ పూర్తయ్యాక.. ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ భవన నిర్మాణ పనులకు కూడా కుటుంబ సమేతంగా భూమి పూజలో పాల్గొంటారు.
భారీ వృక్షాల తరలింపు..
కొత్త సెక్రటేరియట్‌ను సుమారు 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. మంత్రులు, అధికారుల సమావేశాలు అన్నీ సచివాలయంలోనే జరిగేలా కాన్ఫరెన్స్ హాల్స్ నిర్మించనున్నారు. విశాలమైన పార్కింగ్ సదుపాయం, క్యాంటీన్ వంటి అన్ని రకాల వసతులుంటాయి. సెక్రటేరియట్లో పర్యావరణానికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ట్రాన్స్ రిలోకేషన్ పద్ధతిలో భారీ వృక్షాలను సెక్రటేరియట్‌కు తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు.