Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

గెయిన్‌వెల్‌కు ఎల్‌ఈఈడీ అవార్డు

నిర్మాణ, మౌలిక, మైనింగ్‌ రంగాల్లో వినియోగించే భారీ యంత్రాలు క్యాటర్‌పిల్లర్‌ ఎక్విప్‌మెంట్‌ ఆథరైజ్‌ డీలర్‌ గెయిన్‌వెల్‌ కమ్మోసేల్స్‌ ప్రై.లి.కు అరుదైన గౌరవం దక్కింది. యూఎస్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ అందించే ఎల్‌ఈఈడీ (లీడర్‌షిప్‌ ఇన్‌ ఎనర్జీ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ డిజైన్‌) ప్లాటినం అవార్డు దక్కింది. గ్రేటర్‌ నోయిడాలోని ఇంటిగ్రేటెడ్‌ ఫెసిలిటీ (యూఎన్‌ఎన్‌ఏటీఐ)కి ఈ అవార్డు వచ్చిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. గత 75 ఏళ్లుగా క్యాటర్‌పిల్లర్‌కు గెయిన్‌వెల్‌ ఆథరైజ్‌ డీలర్‌గా ఉంటుంది. ఈస్ట్, నార్త్‌ ఇండియాతో పాటూ భూటాన్, నేపాల్‌లో కూడా ఉత్పత్తులను సరఫరా చేస్తుంది.

Related Posts

Latest News Updates