Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

గోడలను పాకే తీగలు.. పైకప్పులో పచ్చని మొక్కలు

ఎండ నుంచి ఉపశమనం పొందాలంటే? కొబ్బరి నీళ్లు తాగడమో, చల్లని పానీయాలు సేవించడమే కాదు. పచ్చని మొక్కలు పెంచడం! మరి, ఈ మొక్కలు ఎక్కడ పెంచాలి అనే ప్రశ్నకు ఎవరిదైనా ఒకటే సమాధానం. ఖాళీ ప్రదేశాల్లో, రోడ్లకు ఇరువైపులా అని! కానీ, ఇప్పుడు వీటి జాబితాలో భవనం పైకప్పు మీద, గోడల మీద, ఎలివేషన్స్‌ మీద ఒకటేమిటీ ఇంటి నిర్మాణంలో వీలున్న ప్రతి చోట పచ్చని మొక్కలను పెంచుతున్నారు. దీన్నే రియల్‌ ఎస్టేట్‌ పరిభాషలో గ్రీన్‌ వాల్స్, వర్టికల్‌ గార్డెన్, రూఫ్‌టాప్‌ గార్డెన్‌ అని అంటారు.

స్థానిక జీవ వైవిద్య వాతావరణం, ఉష్ణోగత్ర నియంత్రణలతో కూడిన బిల్డింగ్‌ డిజైన్స్‌ గ్రీన్‌ ప్లాట్‌ రేషియోను పెంచే నిర్మాణాలకు డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుత అర్బన్‌ ఆర్కిటెక్చర్‌లో గ్రీన్‌ డిజైన్‌ అనేది అత్యంత కీలకంగా మారింది కూడా. దీంతో సింగపూర్, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు గ్రీన్‌ ప్లాట్‌ రేషియో (జీపీఆర్‌)ను ఆవిష్కరించాయి. పట్టణ భవన నిర్మాణ డిజైన్స్‌లో జీపీఆర్‌కు ప్రముఖ స్థానం ఇస్తున్నాయి. దీంతో ఇన్నాళ్లూ హోటల్స్, షాపింగ్‌ మాల్స్‌లకు మాత్రమే పరిమితమైన గ్రీన్‌ వాల్స్‌.. ఇప్పుడు నివాస భవనాలకూ విస్తరించింది. భవిష్యత్తు నగరాల జాబితాలో గ్రీన్‌ ప్లాట్‌ రేషియో అత్యంత కీలకంగా మారనుంది. భవనాల్లో ఉష్ణతాపాన్ని నిరోధించడానికి గ్రీన్‌ ప్లాట్‌ రేషియో అనేది అత్యవసరం.
బిల్టప్‌ ఏరియా మాదిరిగానే..
మొత్తం ప్రాజెక్ట్‌ సైట్‌ ఏరియాలో గ్రీనరీ ఆక్రమించే నిష్పత్తిని గ్రీన్‌ ప్లాట్‌ రేషియో (జీపీఆర్‌) అంటారు. ఇది సహజ జీవ వైవిద్య ప్రమాణాల మీద ఆధారపడే లీఫ్‌ ఏరియా ఇండెక్స్‌ (ఎల్‌ఏఐ). సింపుల్‌గా నిర్మాణ పరిభాషలో చెప్పాలంటే.. ఎలాగైతే భవన నిర్మాణంలో బిల్టప్‌ ఏరియాను ఏ విధంగా అయితే లెక్కిస్తామో.. అలాగే ప్రాజెక్ట్‌ సైట్‌లో ఎల్‌ఏఐ గ్రీనరీ నిష్పత్తిని లెక్కిస్తార్నమాట.
గ్రీనరీతో భర్తీ చేయాల్సిందే..
జీపీఆర్‌ అనేది భవన నిర్మాణంలో ఏ ప్రాంతాన్ని వదలకుండా గ్రీనరీకి ప్రాముఖ్యతను ఇస్తుంది. భవన నిర్మాణ సమయంలో పొదలు, గ్రాస్‌ ల్యాండ్స్, చెట్లను తొలగించాల్సి వచ్చినప్పుడు.. జీపీఆర్‌ అభివృద్ధి ద్వారా ఈ నష్టాన్ని భర్తీ చేయాల్సి ఉంటుంది. అంటే నిర్మాణంలో గ్రీనరీకి స్పేస్‌ కల్పిస్తూ సహజ వాతావరణాన్ని సృష్టించాలన్నమాట. ఎలాగంటే? భవనం పైన, గోడలు, ఖాళీ స్థలాలు, ఓపెన్‌ ప్రదేశాల్లో గ్రీనరీని పెంచాలి. నిర్వహణ చేయాలి. వర్టికల్‌ గార్డెన్, రూఫ్‌టాప్‌ గార్డెన్, వాల్‌ గార్డెనింగ్‌ వంటి వాటికి ప్రాముఖ్యతను ఇవ్వాలి.

జీపీఆర్‌ వ్యయం భరించేది ప్రభుత్వమే..
డెవలపర్లు, ఆర్కిటెక్ట్క్‌లు తమ డిజైన్స్‌లో గ్రీనరీకి ప్రాధాన్యం ఇచ్చేలా వారిని ప్రోత్సహించేందుకు సింగపూర్‌ ప్రభుత్వం ల్యాండ్‌స్కేపింగ్‌ ఫర్‌ అర్బన్‌ స్పేసెస్‌ అండ్‌ హైరైజెస్‌ (ఎల్‌యూఎస్‌హెచ్‌) పాలసీని తీసుకొచ్చింది. రూఫ్‌టాప్‌ గార్డెనింగ్, గ్రీన్‌ వాల్స్‌ను ఏర్పాటు చేసేందుకు అయ్యే ఖర్చులో సగం వరకూ ప్రభుత్వమే భరిస్తుంది కూడా. దీంతో చాలా మంది డెవలపర్లు తమ ప్రాజెక్ట్‌లను ఎకో–ఫ్రెండ్రీ స్ట్రక్చర్స్‌గా తీర్చిదిద్దేందుకు ముందుకొస్తున్నారు.
హైదరాబాద్‌లో 8 శాతం గ్రీనరీ..
గ్రేటర్‌ హైదరాబాద్‌ విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్లు. అంటే 1.54 లక్షల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. సిటీలో హరితం శాతం 8 మాత్రం. అంటే మహా నగరంలో సుమారు 12,320 ఎకరాల్లో హరిత వాతావరణం (గ్రీన్‌బెల్ట్‌) ఉందన్నమాట. దీన్ని 24,710 ఎకరాలకు అంటే మొత్తం నగర విస్తీర్ణంలో గ్రీన్‌ బెల్ట్‌ను 16 శాతానికి పెంచాల్సిన ఆవశ్యకత ఉందని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. దేశంలో అత్యంత గ్రీనరీ నగరంగా చండీఘడ్‌ నిలిచింది. ఇక్కడ గ్రీనరీ బెల్ట్‌ 35 శాతం. దేశ రాజధాని ఢిల్లీలో 20.20 శాతం, గ్రీన్‌ సిటీగా పేరొందిన బెంగళూరులో 19 శాతం, కోల్‌కత్తాలో 15 శాతం, ముంబైలో 10 శాతం, చెన్నైలో 9.5 శాతం గ్రీన్‌ బెల్ట్‌ ఉన్నట్లు పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.

గ్రీన్‌ ప్లాట్‌ రేషియో ప్రాజెక్ట్‌ మురారీ.. గిరిధారీ హోమ్స్‌ గ్రీన్‌ ప్లాట్‌ రేషియోను పెంచే వినూత్న ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. టీఎస్‌పీఏ (అప్పా) జంక్షన్‌ సమీపంలోని బండ్లగూడ జాగీర్‌లో 2 ఎకరాల్లో మురారీ వెంచర్‌ను అభివృద్ధి చేస్తుంది. ప్రాజెక్ట్‌లో మొత్తం 1,06,100 చ.అ.ల్లో గ్రీనరీ ఉంటుంది. ప్రాజెక్ట్‌ చుట్టూ 35 వేల చ.అ., టెర్రస్‌ మీద 13,500 చ.అ., ఎలివేషన్‌లో 57,600 చ.అ.ల్లో గ్రీనరీ ఉంటుంది. అరెకా ఫామ్, ఫామ్‌ ట్రీ, క్రీపర్స్‌ వంటి సుమారు 20 రకాల మొక్కలుంటాయి.
– ప్రాజెక్ట్‌లో మొత్తం 155 ఫ్లాట్లు. వసతుల విషయానికొస్తే.. 4,700 చ.అ.ల్లో క్లబ్‌ హౌజ్, 2 వేల చ.అ.ల్లో కిడ్స్‌ పూల్, గోల్ఫ్‌ జోన్, గెస్ట్‌ రూమ్స్, టెర్రస్‌ పార్టీ ఏరియా, సీనియర్‌ సిటిజన్స్‌ కార్నర్, చిల్డ్రన్స్‌ ప్లే ఏరియా, ఇండోర్‌ గేమ్స్, బాస్కెట్‌ అండ్‌ వాలీబాల్‌ కోర్ట్స్, ఫార్మసీ, సెలూన్, ఫిట్‌నెస్‌ జోన్, యోగ అండ్‌ మెడిటేషన్‌ జోన్, ఆంపి థియేటర్‌ వంటి అన్ని రకాల వసతులంటాయని గిరాధారి హోమ్స్‌ ఎండీ ఇంద్రసేనా రెడ్డి తెలిపారు.

Related Posts

Latest News Updates