ఫర్నీచర్ రంగ సంస్థ గోద్రెజ్ ఇంటీరియో పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో 2020 మార్చికల్లా కొత్తగా 30 ఎక్స్క్లూజివ్ ఔట్లెట్లు నెలకొల్పుతోంది. అలాగే డీలర్ నెట్వర్క్ ద్వారా 70 షోరూంలు ప్రారంభిస్తున్నట్టు గోద్రెజ్ ఇంటీరియో మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సుబోధ్ కుమార్ మెహతా తెలిపారు. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 16 కేంద్రాలు రానున్నాయని వెల్లడించారు. ఇప్పటికే కంపెనీకి భారత్లో 250 ఎక్స్క్లూజివ్ స్టోర్లు, డీలర్ల నిర్వహణలో 800లకుపైగా కేంద్రాలున్నాయని చెప్పారు. ‘కంపెనీ అమ్మకాల్లో టాప్–5 రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ ఉన్నాయి. ఆదాయంలో ఈ రాష్ట్రాల వాటా 14 శాతం. భారత ఫర్నీచర్ విపణి రూ.75,000 కోట్లుంది. వ్యవస్థీకత రంగం 20 శాతం కైవసం చేసుకుంది. ఇందులో గోద్రెజ్కు 15 శాతం వాటా ఉంది. మా కస్టమర్లలో 40 శాతం మంది కస్టమైజేషన్ కోరుకుంటున్నారు’ అని వివరించారు.