Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

ఘనంగా ప్రారంభమైన బ్రిగేడ్‌ ప్రాపర్టీ షో

బెంగళూరుకు చెందిన ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ బ్రిగేడ్‌ గ్రూప్‌ హైదరాబాద్‌లో మెగా హోమ్‌ ఫెస్ట్‌ను ప్రారంభించింది. మూడు రోజుల ఈ ప్రాపర్టీ షోను శుక్రవారం హైటెక్‌ సిటీలోని రాడిసన్‌ హోటల్‌లో ఘనంగా ప్రారంభమైంది. కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజేష్‌ శ్రీరామ్‌శెట్టి, ఏజీఎం (సేల్స్‌) వెంకటరమణ, ఏజీఎం (ఇంటర్నేషనల్‌ సేల్స్‌) బినోయ్‌ వర్ఘీసీ, ఏజీఎం (బీడీ) రాజేష్‌ తొలపీ ముఖ్య అతిథులుగా హాజరై హోమ్‌ ఫెస్ట్‌ను ప్రారంభించారు. బ్రిగేడ్‌ హోమ్‌ ఫెస్ట్‌ శని, ఆదివారాల్లోనూ అందుబాటులో ఉంటుంది. ప్రవేశం ఉచితం.
రూ.27 లక్షల నుంచి..
సందర్శకులతో హోమ్‌ ఫెస్ట్‌లో ఉదయం నుంచి సందడి కనిపించింది. ప్రాజెక్ట్‌ల వివరాలు, ధరలు, వసతుల గురించి స్థానిక ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. పలువురు సందర్శకులు అక్కడిక్కడే ఫ్లాట్స్‌ బుకింగ్స్‌ కోసం ఆసక్తి చూపించారు. హోమ్‌ ఫెస్ట్‌లో బెంగళూరు, మైసూరు, చెన్నై వంటి నగరాలకు చెందిన 25కి పైగా బ్రిగేడ్‌ గ్రూప్‌ ప్రాజెక్ట్‌లను ప్రదర్శించారు. ధర రూ.27 లక్షల నుంచి రూ.4.29 కోట్ల వరకు గల ప్రాపర్టీలు ఈ ప్రాపర్టీ షోలో ఉన్నాయి. అపార్ట్‌మెంట్స్, సీనియర్‌ లివింగ్, ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్స్, టౌన్‌హౌజెస్, విల్లాలు వంటి అన్ని రకాల ప్రాపర్టీలు అందుబాటులో ఉన్నాయని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

Related Posts

Latest News Updates