Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

చంద్రబాబు ప్రజా వేదిక నేలమట్టం

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమంగా నిర్మించిన ప్రజా వేదిక భవనం నేలమట్టమైంది. అక్రమ నిర్మాణాలను నిర్మించిన ప్రతి ఒక్కరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని, తన పర అనే బేధం లేకుండా ప్రతి ఒక్క అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన సీఆర్‌డీఏ అదనపు కమీషనర్‌ విజయకృష్ణన్‌ నేతృత్వంలో అధికారుల బృందం ముందుగా చంద్రబాబు నివాసం, ప్రజా వేదికను కూల్చివేతతోనే ప్రారంభించారు.

నదీ పరిరక్షణ చట్టం ప్రకారం నదికి 500 మీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం ఉండవల్లిలో కృష్ణా నది రివర్‌ బెడ్‌లో అక్రమంగా ప్రజా వేదికను నిర్మించింది. ఈ భవనాన్ని నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ (ఎన్‌సీసీ) 8.90 కోట్లతో నిర్మించింది. అక్రమ నిర్మాణాలపై సీరియస్‌ అయిన జగన్‌మోహన్‌ రెడ్డి కూల్చివేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ముందుగా అధికారులు జేసీబీ, 6 ట్రక్క్‌లు, 30 మంది లేబర్స్‌తో క్యాంటిన్, వంట షెడ్, ప్రహారీలను నేలమట్టం చేశారు. ఆ తర్వాత మొత్తం భవనాని కూల్చివేశారు.

ప్రజావేదికలోని వస్తువులన్నీ..
ప్రజావేదికలోని విలువైన ఫర్నీచర్, కంప్యూటర్లు, ఏసీలు, మైక్‌ సిస్టమ్, ఎలక్ట్రానిక్‌ సామాగ్రి, పూల కుండీలు వంటివి అన్ని వివరాలను నమోదు చేసుకున్నారు. కుండీలన్నింటినీ రాయపూడి సమీపంలోని సీఆర్‌డీఏ నర్సరీకి, మిగిలిన వస్తువులను సచివాలయానికి తరలించారు.

Related Posts

Latest News Updates