Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

జాప్యం జరిగితే అనుమతి లభించినట్లే!

తెలంగాణలో కొత్త మున్సిపల్‌ చట్టం అమల్లోకి వచ్చింది. కొత్త బిల్లును శాసన సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘పౌరులకు స్నేహపూర్వక పట్టణ విధానమిది. పూర్తిగా పారదర్శకంగా ఉంటది. అనుమతుల కోసం మునిసిపల్‌ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరముండదు. 500 చదరపు మీటర్ల çస్థలం, 10 మీటర్ల ఎత్తు వరకు నిర్మించే కట్టడాల అనుమతి కోసం మున్సిపల్‌ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. వేధింపులుండవు. మానవ ప్రమేయముండదు. పూర్తిగా ఆన్‌లైన్‌లో అనుమతులిస్తరు. నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లయితే ఆన్‌లైన్‌లో అనుమతి ఆయన ఇంటికే వెళ్తది. దీనికి నిర్ణీత కాలపరితి పెడుతున్నం. ఆలోగా అనుమతి రాకపోతే వచ్చినట్లే భావించి నిర్మాణం ప్రారంభించుకోవచ్చని’ సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.
అక్రమ కట్టడాలు ప్రారంభిస్తే కూల్చివేతే..
‘‘తప్పు చేయకూడదన్న భయం తేవడం కోసం అక్రమ కట్టడాలకు భారీ జరిమానాలు పెట్టాం.అక్రమ కట్టడం నిర్మించడం ప్రారంభిస్తే నోటిసులు ఇవ్వకుండా తక్షణమే కూల్చివేస్తామని చట్టంలో పెట్టాం. ఎంత ఖర్చు పెట్టారో చూడం. అక్రమ కట్టడాలపై చాలా సందర్భాల్లో హైకోర్టు చేసిన వాఖ్యాలతో ప్రభుత్వం తప్పు లేకపోయినా తలదించుకోవాల్సి వచ్చింది. బీఆర్‌ఎస్‌పై హైకోర్టు చేసిన వాఖ్యాలతో తలకొట్టించుకున్నంత పనైంది. అక్రమ కట్టడాలను రాష్ట్రంలో ఎట్టి పరిస్థితిలో అనుమతించం. తప్పు చేస్తే లాభపడతం అనే ఉద్దేశం నుంచి తప్పు చేస్తే కష్టపడుతం అన్న భయం ప్రజల్లో రావాలి’’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

Related Posts

Latest News Updates