సింగపూర్‌కు చెందిన ప్రముఖ లాజిస్టిక్ డెవలపర్ హైదరాబాద్‌లో భారీ లాజిస్టిక్ పార్క్‌ను ఏర్పాటు చేయనుంది. శంషాబాద్‌లోని జీఎంఆర్ ఎయిర్పోర్ట్ సిటీలో ఈ–షాంఘ్ రెడ్‌వుడ్ (ఈఎస్ఆర్) 120 ఎకరాల లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు రెండు కంపెనీల మధ్య ఒప్పందం తుది దశలో ఉన్నట్లు సమాచారం.
ప్రముఖ ఈ–కామర్స్ కంపెనీలన్నీ కస్టమర్లే..
హైదరాబాద్‌తో పాటూ పుణె, కోల్కత్తా, ముంబై నగరాల్లోనూ లాజిస్టిక్ పార్క్‌లను ఏర్పాటు చేయనుంది. ఏడాది కాలంలో 6 ఇండస్ట్రియల్ పార్క్‌లను అందుబాటులోకి తీసుకురావాలన్నది కంపెనీ లక్ష్యం. ఒక్కో పార్క్ 50–125 ఎకరాల్లో ఉంటుంది. ఈఎస్ఆర్కు గ్లోబల్‌లో ప్రముఖ ఈ–కామర్స్ కంపెనీలన్నీ కస్టమర్లుగా ఉన్నాయి. అమెజాన్, అలీబాబా, జేడీ.కామ్ వంటి సంస్థలు దీని కస్టమర్లే.