Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

జీహెచ్‌ఎంసీలో నకిలీ ప్రాపర్టీ నంబర్లు

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)లో నకిలీ ప్రాపర్టీ ట్యాక్స్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ (పీటీఐఎన్‌) గుట్టురట్టయింది. జీహెచ్‌ఎంసీలో డాటా ఎంట్రీ ఆపరేటర్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి జే చంద్‌ వెలగా, అతని సోదరుడు ఓల్డ్‌ అల్వాల్‌ నివాసి నాగేంద్ర బాబు ఇద్దరు కలిసి మోసపూరితంగా నాలుగు పీటీఐఎన్‌లను సృష్టించారు.
రాజేంద్రనగర్‌లోని ప్రేమవతిపేట్‌లో..
జీహెచ్‌ఎంసీ ప్రతి ప్రాపర్టీకి 10 అంకెల నంబర్లను కేటాయిస్తున్న విషయం తెలిసిందే. సాఫ్ట్‌వేర్‌ నిపుణుడైన నాగేంద్ర బాబు డబ్బుల కోసం జీహెచ్‌ఎంసీ వెబ్‌ పోర్టల్‌ను హ్యాక్‌ చేసి అక్రమంగా లాగిన్‌ అయ్యాడు. రాజేంద్రనగర్‌లోని ప్రేమవతిపేట్‌లోని ఓ ప్లాట్‌కు నకిలీ తప్పుడు డోర్‌ నంబర్, ప్రాపర్టీ డేటాను సృష్టించారు. ప్లాట్‌ యజమాని రాజేంద్రనగర్‌ డిప్యూటీ కమీషనర్‌ టీ దశరథ్‌కు ఫిర్యాదు చేయడంతో అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు చేసిన సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నిందితులను పట్టుకున్నారు.

Related Posts

Latest News Updates