Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

జీహెచ్‌ఎంసీలో భూసేకరణకు ప్రత్యేక విభాగం

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)లో భూ సేకరణ కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు కానుంది. అభివృద్ధి ప్రాజెక్ట్‌లకు అవసరమైన భూములను సమీకరించడం, పరిహారాన్ని అందేలా చూడటం, ఇప్పటికే ఉన్న కోర్ట్‌ కేసులను పరిష్కరించడం ఈ విభాగం పని. స్పెషల్‌ సెల్‌ ఏర్పాటు ప్రతిపాదనకు జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీలో ఆమోదం పొంది, ప్రభుత్వ అనుమతితో వీలైనంత త్వరగా ఏర్పాటు చేస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిశోర్‌ తెలిపారు.
భూసేకరణ విభాగంలో ఎవరుంటారంటే?
భూసేకరణ అంశాలకు సంబంధించి తగిన అవగాహన ఉన్న అధికారులు అవసరం. అందుకుగాను రిటైర్డు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌తో పాటు సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్, ఒక పోలీసు అధికారి ముఖ్యులుగా ఉంటారు. ఈ విభాగం పనితీరు పర్యవేక్షణ, రెవెన్యూ తదితర విభాగాలతో సమన్వయం కోసం ప్రత్యేకంగా ఒక అడిషనల్‌ కమిషనర్‌ను నియమిస్తారు. సర్వే, నోటీసుల జారీ తదితర అంశాల కోసం న్యాక్‌ నుంచి ఔట్‌సోర్సింగ్‌పై తీసుకున్న 20 మంది ఇంజినీర్లు, పదిమంది సర్వేయర్లుంటారు.

Related Posts

Latest News Updates