Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

జులై 31 వరకూ టీఎస్‌–రెరా నమోదు అవకాశం

తెలంగాణలోని రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లకు మరొక అవకాశం. టీఎస్‌–రెరాలో నమోదు గడువును తెలంగాణ స్టేట్‌ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (టీఎస్‌–రెరా) జులై 31 వరకు పొడిగించింది. రూ.3 లక్షల జరిమానాతో ప్రాజెక్ట్‌ల రిజిస్ట్రేషన్స్‌ చేసుకోవచ్చని టీఎస్‌–రెరా చైర్మన్‌ రాజేశ్వర్‌ తివారీ తెలిపారు.
2017 జనవరి 1 తర్వాత..
2017 జనవరి 1 తర్వాత జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, యూడీఏ, మున్సిపాలిటీలు, పంచాయతీలు, టీఎస్‌ఐఐసీ నుంచి అనుమతి తీసుకున్న ప్రతి ఒక్క ప్రాజెక్ట్‌ టీఎస్‌–రెరాలో నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. 500 చదరపు మీటర్లు లేదా 8 కంటే ఎక్కువ ఫ్లాట్లు ఉన్న ప్రతి ప్రాజెక్ట్‌ టీఎస్‌–రెరా పరిధిలోకి వస్తుందని తెలిపారు.

Related Posts

Latest News Updates