Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

టీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీసు @ రూ.60 లక్షల వ్యయం

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) జిల్లా కేంద్రాల్లో నిర్మిస్తున్న పార్టీ కార్యాలయాలకు ఒక్క దానికి రూ.60 లక్షలు వెచ్చిస్తోంది. ఈ మేరకు ఆయా చెక్‌లను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు పార్టీ నేతలకు అందజేశారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, దసరా నాటికి అందుబాటులోకి తీసుకురావాలని కేసీఆర్‌ పార్టీ నేతలను ఆదేశించారు. నిబంధనలకు లోబడి నిర్మాణ పనులను చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టీ ఆఫీసు నిర్మాణ పనులకు జూన్‌ 27న శంకుస్థాపన జరిగిన విషయం తెలిసిందే.

Related Posts

Latest News Updates